కేవలం చదువుకోవాాలన్న ఆశ మాత్రమే ఉంటే సరిపోదు. విద్యార్థి కోరుకున్న చదువు చదవాలంటే ప్రస్తుత రోజుల్లో చేతిలో డబ్బు కూడా కావాలి.

ఇలా చాలా మంది చదువు మీద ఆశ ఉండి, ఎంతో  ప్రతిభ ఉన్నా డబ్బులేక చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉండి,పేదరికం వల్ల చదువుకోలేకపోతున్న వారి కోసం ,పేద విద్యార్థుల్లో ప్రతిభ ఆధారం గా చదువుకొనే అవకాశం కల్పించడం కోసం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ ఫౌండేషన్‌ స్కారల్ షిప్ లు అందిస్తోంది.

ONGC Foundation 2000 Scholarships:

ONGC Foundation తరపున అందించే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.48,000 వేల రూపాయలు అందజేస్తారు.

వివరాల్లోకి వెళ్తే

ఈ స్కాలర్షిప్ ని కేవలం ప్రతిభావంతులైన 2వేల మందికి మాత్రమే అందచేస్తారు .

ప్రస్తుతం 2020–2021 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌ల నోటిఫికేషన్‌ విడుదల చేసింది

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 2021,ఆగస్టు 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ఇక్కడ క్లిక్‌ చేయండి:

https://ongcscholar.org/#/schemeAndRules/apply

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 2000 , దీనిలో కాస్ట్ (Caste ) వారీగా ఇలా ఉంటాయి .

ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య – 1000

జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్ లు– 500

ఓబీసీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య – 500

అర్హత:

ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు (ఎంబీఏ), జియాలజీ, జియోఫిజిక్స్‌ చదివే ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు.

అయితే 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొందిన వారు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు అర్హులు.

మొత్తం 2000 స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 50 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు కేటాయిస్తారు.

ఎంపిక విధానం

సంబంధిత కోర్సుకు నిర్దేశించిన అర్హత పరీక్షలో విద్యార్థి వచ్చిన మార్కుల ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్ ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తులకు ఆఖరి తేది: ఆగస్టు 6, 2021

పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ https://ongcscholar.org/ లేదా https://ongcindia.com/ ని ఒకసారి క్లుప్తం గా నోటిఫిఅకేషన్ ని చుడండి .

ఇక ఆలస్యం చేయకుండా మీకు అన్నీ అర్హతలు ఉన్నాయి అనుకుంటే వెంటనే అప్లై చేయండి .

విష్ యూ ఆల్ ది బెస్ట్ ….  (We Wish you all the best ) ….