వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఇటీవల భారీగా జాబ్ మేళా (YSRCP Job Mela) లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ జాబ్ మేళా (Job Mela) ల ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

ఇప్పటికే గుంటూరు, వైజాగ్, తిరుపతిలో విజయవంతంగా జాబ్ మేళాలను నిర్వహించిన వైసీపీ తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సన్నద్ధమైంది. ఈ నెల 25న కడప జిల్లాలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు(RajyaSabha Member) విజయసాయిరెడ్డి(Vijaysai reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

చాపాడు మండలం(Chapadu Mandalam)లోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ మెగా జాబ్‌ మేళా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లు(Posters), వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి ఇటీవల విజయసారిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళాలో TCL, Green Tech Industries, Tech Mahindra, Conflux Systems Inc, Shriram, Concentrix, Sagar, Cogent, Pioneer, Cerium Technology, Paytm, Byjus, Wingtech, Big Basket, OMICS International, Bharat Fih, Navata Road Transport, Axis Bank, Muthoot Finance, Avani Technology Solution, Mouri Tech, Apollo, Hyundai Mobis, Amara Raja, Med Plus, Airtel Payment Bank, Lomaa, ACN Health Care తదితర కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయి.

అయితే, ఈ జాబ్ మేళాకు సంబంధించి అర్హత(Qualifed), ఆసక్తి(Interest) కలిగిన అభ్యర్థులు(Candidates) ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://ysrcpjobmela.com/ వెబ్ సైట్లో(Website) రిజిస్టర్(Register) చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం:

* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ను ఓపెన్ చేయాలి.
* తరువాత YSR District Job Mela కింద కనిపించే Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* కొత్త పేజీ ఓపెన్(New page Open) అవుతుంది. అందులో పేరు, కాంటాక్ట్ నంబర్, మెయిల్ ఐడీ, నియోజకవర్గం, విద్యార్హత, చిరునామా నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
* రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌(CBIT Engineering) కాలేజీలో ఈ నెల 25న జరిగే జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.