ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఒకటైన సిద్దిపేట(Siddipeta)లోని కేంద్రీయ విద్యాలయ(kendriya Vidyalaya) లో టీచింగ్ పోస్టుల(Teaching Posts) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన(contractual basis) ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో టీజీటీ(TGT), పీఆర్టీ(PRT) స్పెషల్ ఎడ్యుకేటర్(Special Educator) పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్(English), హిందీ(Hindi), మ్యాథమెటిక్స్(Mathematics), సైన్స్(Science), సోషల్ స్టడీస్(Social Studies) తదితర విభాగల్లో ఖాళీలు ఉన్నాయి.

టీజీటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు(Register) చేసుకునే అభ్యర్ధుల(Candidates)కు 50శాతం మార్కులతో ఎన్సీఈఆర్టీ(NCERT) ఇంటిగ్రేటెడ్ డిగ్రీ(Integrated Degree), బ్యాచిలర్స్ డిగ్రీ(Bachelor Degree) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు 35 ఏళ్లకు మించరాదు. పీఆర్ టీ పోస్టులకు సంబంధించి కనీసం 50శాతం మార్కులతో సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ (Senior Secondary Education), డిప్లొమా(Diploma) ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(Elementary Education), బీఈడీ(B.ED) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు సంబంధించి బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సంబంధిత పనిలో అనుభవం(Work Experience), కంప్యూటర్ నాలెడ్జ్‌(Computer Knowledge) ఉండాలి. వయస్సు 30ఏళ్ల కు మించరాదు. అభ్యర్ధుల ఎంపిక విషయానకి వస్తే ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

ఇంటర్వ్యూ(Interview)లో మెరిట్ అధారం(Merit Based)గా తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఆగస్టు 24,25, 2022లలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; ఫస్ట్ ఫ్లోర్, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో, సిద్ధిపేట.

ఇంటర్వ్యూ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది. ఒక సెట్  అర్హత గల పత్రాల(Documents) జిరాక్స్ కాపీల(Xerox Copies)తో పాటు.. వెరిఫికేషన్(Verification) కొరకు ఒరిజినల్ సర్టిఫికేట్ల(Original Certificates)తో హాజరవ్వాలని ప్రత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.