వాల్ నట్స్ (Walnuts) వీటినే మన తెలుగులో అక్రోటుకాయలు(ACROT)  అని అంటారు అన్ని గింజలు మాదిరిగా, వాల్నట్ లో మంచి కొవ్వులు(Good Fats) ఉంటాయి, వీటిలో ఎక్కువ ప్రొటీన్లు(Proteins) కలిగి ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుంది.

మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో వాల్నట్ కీలకపాత్ర(Main Role) పోషిస్తాయి. ఇందులో విటమిన్స్(Vitamins), క్యాలరీస్(Calories), ఫైబర్(Fiber), ఒమేగా -3(Omega -3) మరియు ఇనుము(Iron), సెలీనియం(Selenium), కాల్షియం(Calcium), జింక్,(Zinc) విటమిన్ E(Vitamin E) మరియు కొన్ని B విటమిన్లు(B Vitamins) కలిగి వున్నాయి. ఎప్పుడు ఆరోగ్యపరం గా తీసుకునే ఈ వాల్నుట్స్ తో సాయంత్రం పూట స్నాక్స్(Snacks) గా కూడా తీసుకోవచ్చు.

ఓ చాయ్ తో పాటు ఆలు బజ్జి, మిర్చి బజ్జిలతో పాటు క్రిస్పీ(Crispy) గా వుండే మసాలా వడలు తినుంటే అబ్బో ఆ రుచే వేరు! ఆలా ఆస్వాదించాల్సిందే. మరీ వాల్నుట్స్ తో క్రిస్పీ స్నాక్ రెసిపీ(Recipe) ఎలా చేయాలో నేర్చుకుందామా!

వాల్నట్ మసాలా వడకు కావలసినవి:

శనగ పప్పు – 1 1/4 కప్పులు

వాల్నట్ – 1/2 కప్పు

సోంపు – 1 1/2 టీస్పూన్

ఉప్పు – 1 టీస్పూన్

తరిగిన ఉల్లిపాయలు – 2

పచ్చిమిర్చి – 3 తరిగినవి

సన్నగా తరిగిన అల్లం – 1 టేబుల్ స్పూన్

కరివేపాకు సన్నగా తరిగినవి

సన్నగా తరిగిన కొత్తిమీర

నూనె – సరిపడా (డీప్ ఫ్రైయింగ్ కోసం)

తయారు చేయు విధానం:

  • శనగ పప్పును 3 గంటలు నానబెట్టండి. ఆ తరువాత నానపెట్టిన శనగ పప్పుని నీటి నుంచి వడకట్టి, కొన్ని శనగ పప్పుని తీసి పక్కన పెట్టుకోండి.
  • మిక్సర్ జార్‌లో, శనగ పప్పు, వాల్‌నట్స్, సోంపు మరియు ఉప్పు వేసి వడకు వేసుకునే మిశ్రమంలా గ్రైండ్ చేసుకోండి
  • గ్రౌండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి మార్చండి.
  • ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగు, నానబెట్టిన చనా పప్పు, తరిగిన వాల్‌నట్‌లను వేసి బాగా కలపాలి.ఆ తరువాత మిశ్రమలో ఉప్పు మాసాలు అన్ని సరిపదయో లేదో చెక్ చేసుకుని. మిశ్రమాన్ని గుండ్రంగా అంటే వడ్డలు వేసే షేప్ లో చేసుకుని పక్కన పెట్టుకోండి.
  • కడాయిలో నూనె వేడి చేసి, తయారు చేసిన వడలను నూనెలో వేయండి .
  • వాటిని బంగారు గోధుమ రంగు(Gold Brown Color) వచ్చేవరకు మీడియం మంట మీద వేయించాలి.
  • వాటిని కొబ్బరి చట్నీ(Coconut Chutney)తో వేడిగా సర్వ్(Serve) చేయండి.