కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ (Central Government) ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని (Agni path Scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ప్రకటించిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి.

సికింద్రాబాద్ స్టేషన్లో (Secunderabad Station) ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిరుద్యోగి ప్రాణాలను సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

అగ్నిపథ్ కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్(Agni path Notification) ను సైతం విడుదల చేసింది.

ఇండియన్ అర్మీలో అగ్నివీర్(Agni veer) ల ఉద్యోగాల భర్తీకి అధికారులు(Officers) ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో 6 కేటగిరీల్లో(Categories) ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ ఉద్యోగాలు అందుకు సంబంధించిన విద్యార్హతల(Education Qualification) వివరాలు ఇలా ఉన్నాయి.

1. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (General Duty All Arms): టెన్త్ లేదా మెట్రుకులేషన్ (Matriculation) పాసై ఉండాలి.45 శాతం అగ్రిగేట్ (Aggregate) ఉండాలి. ఇంకా 33 శాతం మార్కులు ప్రతీ సబ్జెక్టులో తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు వయస్సు 17 ½ – 23 ఏళ్లు ఉండాలి.

అగ్నివీర్ (టెక్ ) /అగ్నివీర్ టెక్ (Avn & Amn Examiner): అభ్యర్థులు 10+2/ఇంటర్(Inter) పాసై ఉండాలి. ఫిజిక్స్,(Physics)) కెమిస్ట్రీ(Chemistry) మాథ్స్(Maths), ఇంగ్లిష్(English) లో 50 శాతం అగ్రిగేట్ మార్కులు కలిగి ఉండాలి. ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు కలిగి ఉండాలి.

2.అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ (All Arms): అభ్యర్థులు 10+2/ఇంటర్ ఎగ్జామ్ పాసై ఉండాలి.

3.అగ్నివీర్ ట్రేడ్ మెన్స్ (All Arms) 10th Pass: టెన్త్ క్లాస్ (టెన్త్ lass) పాసై ఉండాలి. అగ్రిగేట్ మార్కులపై ఎలాంటి నిబంధన లేదు. అయితే.. ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొంది ఉండాలి. వయస్సు 17 ½ – 23 ఉండాలి.

4.అగ్నివీర్ ట్రేడ్ మెన్స్ (All Arms) 8th Pass: ఈ పోస్టులకు 8వ తరగతి (8THClass) ఉతీర్ణత సాధించి ఉండాలి, ప్రతీ సబ్జెక్టు 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. వయస్సు 17 ½ – 23 ఉండాలి.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ అంటే ఏమిటి?

అగ్నిపథ్(Agni path) అనేది జూన్ 14, 2022న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిక్రూట్‌మెంట్ పథకం(Recruitment Scheme). ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ “అగ్నివీర్స్”(Agni veers) అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ(Army), ఎయిర్ ఫోర్స్(Air Forces) మరియు నేవీ(Navy) అన్ని కేడర్‌ల(Cadres)లో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు.

ఈ పథకం కింద, 2022లో దాదాపు 46,000 మంది యువత రిక్రూట్(Youth Recruit) చేయబడతారు. ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ల సంఖ్య 5,000 పెరుగుతుంది. సైనికుల(Soldiers)కు నెలకు దాదాపు రూ.30,000-40,000 జీతం(Salary) లభిస్తుంది.