వేగంగా నడుస్తున్నప్పుడు(Fast Walk) పాదం మెలిక(foot twist) పడడం, ఆ పై మడమ భాగం(Heel part)లో నొప్పితో బాధపడడం మనలో చాలా మందికి అనుభవమే(Experience), మడమ నొప్పి బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట నిద్రలేచి మంచం కింద అడుగు పెట్టగానే మడమ భాగంలో జివ్వుమనే నొప్పి మనలను విలవిలలాడేలా చేస్తుంది.

అయితే కాస్త అటు ఇటు నడిచాక నొప్పి తగ్గిపోవడంతో మనలో చాలా మందికి సమస్యలు పెద్దగా పట్టించుకోరు. చివరికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు డాక్టర్ల(Doctors) వద్దకు వెళుతుంటారు.

మడమ నొప్పికి ఆయుర్వేదం(Ayurvedam) చెపుతున్న చికిత్సలు(Treatment), పరిష్కార మార్గాల(Solution Ways) గురించి తెలుసుకుందాం!

మన శరీరంలోని పెద్ద ఎముక(Big BONES)ల్లో మడమ ఎముక కూడా ఒకటి. మొత్తం ౩౩ ఎముకల(33 Bones)తో కూడిన అతి పెద్ద కీళ్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. కనీసం వంద కండరాలు ఈ ఎముకలను సంతానం చేసి పాదం కదిలేలా చేస్తున్నాయి. పాదాల కదిలికలు వల్లే మనం నడవగలుగుతున్నాం, నాట్యం చేయగలుగుతున్నాం, అడగలుగుతున్నాం, ఎగిరి దూకగలుగుతున్నాం.

వీటన్నిటికీ మూలం పాదం అడుగున మడమ ఎముకుల(Heel Bone) చుట్టూ వుండే కండరాలే. ఇవి మెత్తటి కుషన్లా ఉపయోగపడి, పాదంలోని ఎముకలు గాయపడకుండా కాపాడుతున్నాయి. ఈ కండరాలు గాయపడితే మన కదిలికలు కట్టుపడిపోతాయి. ఇలాంటప్పుడు పాదం వెనుక భాగంలోనూ, మడమ భాగంలోనూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి మడమ భాగంలో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఏముకలాంటిది పెరిగి అది మడమ ఎముకకు దాని అడుగున వుండే కండరానికి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది.దాంతో అటు మడమ ఎముక, ఇటు మడమ కండరం(Heel Muscle) రెండు గాయపడతాయి.

శక్తికి మించి బరువులు ఎత్తడం ఎముకల్లో అరుగుదల మూలం(Source of erosion) గా కూడా మడమ ఎముక లోని కండరాలు కూడా చిరిగిపోతుంటాయి. ఇలాంటప్పుడు మడమ నొప్పి అనేది సమస్యగా మారుతుంది.మడమ నొప్పి తో బాధపడే వారిలో ఉదయం నిద్రలేచి పాదం నేల మీద మోపగానే నొప్పి మొదలవుతుంటుంది.

నడి వయసు(Middle Age)లో ముఖ్యంగా మహిళ (Women)ల్లో మడమ నొప్పి ఎక్కువగా కనిపిస్తూవుంటుంది. కొద్దీ సేపు విశ్రాంతి(Rest time) గా కూర్చుని లేదా పడుకుని లేచిన తరువాత అడుగు నేల మీద పెట్టగానే తేలు కొట్టినట్టుగా నొప్పి పుడుతూ ఉంటుంది. ఒక్కోసారి అరికాలు, పాదాలు విపరీతమైన మంట(Inflammation), తిమ్మిరి(numbness), స్పర్శ తెలియకపోవడం(Tingling) వంటి బాధలు కూడా వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు మడమ  నొప్పి నుంచి ఉపశమనం(Relax) పొందడానికి బరువు తగ్గడాన్ని(Weight loss) ఒక మార్గంగా చెబుతారు నిపుణులు(Experts). మడమ కండరం పైన ఒత్తిడి(Stress) తెచ్చేందుకు తగ్గించేందుకోసం గరుగు నేల మీద  నడవకుండా ఉండడం అవసరం. ఎక్కువ దూరం నడవకూడదు పాదాలకు రక్షణగా మెత్తటి కుషన్(Soft Cushion) చెప్పులు వాడడం మేలు.

మడమ భాగంలో తరుచుగా ఐస్ ముక్కల(Ice pieces)తో కానీ గోరువెచ్చటి ఉప్పు(warmed salt)తో కానీ  కాపడం పెడుతూ ఉంటే బాధలు ఉపశమనమిస్తుంటాయి. టెన్నిస్ బంతి(tennis ball)ని పాదం కింద తొక్కి పట్టి ఉంచడం, పాదానికి పొడవాటి  వస్త్రాన్ని చుట్టి కవ్వంలాగా తిప్పటం చేస్తుంటే మడమ నొప్పి నుంచి మంచి ఉపశమనం(Relaxation)గా ఉంటుంది.  మడమ నొప్పి(Heel Pain) వాతం ఎక్కువగా ఉదయం పూటే వేధిస్తుంటాయి. తరువాత తగ్గిపోతుంటాయి. దింతో చాలా మంది మడమ నొప్పిని పెద్దగా పట్టించుకోరు.

నిజానికి మడమ నొప్పి మొదలైనప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే అది దీర్ఘకాలిక సమస్యగా మారకుండా చూసుకోవచ్చు. మడమ నొప్పితో బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా వొంట్లో వాతం పెరగకుండా చూసుకోవాలి. ఇందుకు వాతం నొప్పులను పెంచే పులుపు, దుంప కూరలు, కష్టంగా అరిగే పదార్దాలకు దూరంగా ఉండాలి.

మడమ నొప్పికి నాటు వైద్యం(Healing), పచ్చబొట్లు (Tattoos) లాంటివి చేయకూడదు. నొప్పి నివారణలు(Pain Control) దూరంగా ఉండడమే మేలు నొప్పి తీవ్రత ఎక్కువగా వున్నపుడు పాదాలను వేడి నీళ్ళ(Hot Water)ల్లో ఉంచి అడుగు పాదాన్ని నెమ్మదిగా కదుపుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుంచి తక్షణం ఉపశమనం దొరుకుతుంది.

ఆయుర్వేదం పరంగా గగనదివటి(Gaganadivati) అనే ఔషధం(Medicines) మడమ నొప్పిని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మడమ నొప్పి ఎంతకు తగ్గనపుడు, దీర్ఘకాలిక సమస్య(Chronological problems)గా మారినపుడు మాత్రం ఆపరేషన్(Operation) దాక వెళాల్సివుంటుంది.