ప్రస్తుత కాలం లో ప్రతీ ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నాం. ఈరోజుల్లో వర్క్ ఫ్రొం హోమ్ (Work from home) ఏ అయినా కూడా అసలా టైం ఉండడం లేదు . దీనితో మన ఆరోగ్యం ,అందం గురుంచి పట్టించుకోవడమే మానేసాం.

కానీ కొన్ని సహజ ఉత్పత్తులతో ఉన్న టైం లో నే మన చర్మం గురుంచి కేర్ తీసుకుంటే 30 ల కూడా యవ్వనం గా అందం గా కనిపించొచ్చు .  మరి అవేంటో చూసేద్దామా !!

కలబంద

కలబంద జెల్ ,అదేనండీ ,మనం ఎక్కువగా వినే,అలోవెరా జెల్ (Aloevera Gel) చర్మం మరియు జుట్టు సంబంధిత సమస్యలకు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది చెప్పవచ్చు.

Aloevera gel

ఇది  ముఖం మీద నల్లటి మచ్చలు, పొడి చర్మం మరియు మచ్చలను తొలగించగలదు.

దీన్ని బయట  దుకాణాలలో విక్రయించే చాలా ఫెయిర్ ఉత్పత్తులలో ఇది  అతి ముఖ్యమైన అంశం.

ఇక ఆలస్యం ఎందుకు ,అలోవెరా జెల్ ను ప్రతిరోజూ ముఖానికి రాసుకుని , 20 నిమిషాలు తరువాత కడిగేయండి.

మీ చర్మం ఎంతో ప్రకాశవంతం గా ఉంటుంది .

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ (Petrolium jelly )ని వివిధ రకాల చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాస్తవానికి, లిప్ బామ్ లేనప్పుడు సాధారణంగా ఉపయోగించే లిప్ బామ్స్‌లో ఇది ఒకటి.

మీ పెదవులు తరచుగా పొడి బారి పోతున్నాయా ? మీ పెదవులపై పెట్రోలియం జెల్లీని రాయండి .

తరచూ ఇలా రాయడం వల్ల పెదవులు పొడిగా మారకుండా రోజంతా తేమగా ఉంటాయి.

అదేవిధంగా మీ చేతులు పొడిగా ఉన్నట్లు కనిపిస్తే పెట్రోలియం జెల్లీని ఉపయోగించవచ్చు.

బంగాళాదుంప

కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను బంగాళాదుంప (Potato) తొలగిస్తుంది. బంగాళా దుంప రసంలో దూదిని ముంచి, కళ్లపై పెట్టుకుని ఒక  10-15 నిమిషాలు ఉంచాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తే క్రమంగా కళ్ళ చుట్టూ ఉండే  నల్లటి వలయాలు తగ్గుతాయి.

Potato

అలాగే బంగాళ దుంప రసంతో రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై ముడతలు కూడా క్రమం గా తగ్గుతాయి.

ఎండకు చర్మం కమిలిపోయినా, ముఖంపై తెల్లటి మచ్చలు వచ్చినా బంగాళాదుంప రసం రాస్తే చర్మం మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది.

బంగాళాదుంప రసానికి కొద్దిగా తేనె,నిమ్మరసం, కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేస్తే చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.

చర్మం ఛాయను మరింత  పెంచేందుకు మరో చిట్కా కూడా ఉంది.

బంగాళా దుంపను ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిసి ముఖానికి పట్టించండి.

పావుగంట తరువాత  ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది.

ముల్తానీ మట్టి

ఈ రోజుల్లో ముల్తాని మట్టి (Multani Matti) ని రంగును పెంచడానికి ఫేస్ ప్యాక్‌లను ధరించడం సర్వ సాధారణం అయిపొయింది. ఎన్ని రకాల ఉత్పత్తులు మార్కెట్ లో ఉన్నా  ప్రత్యేక ఫేస్ ప్యాక్, అది ముల్తానీ మట్టి. చర్మం నుండి అదనపు జిడ్డుగల గమ్‌ను తొలగిస్తుంది మరియు రంధ్రాల లోతు నుండి ధూళిని సులభంగా తొలగిస్తుంది,దీనితో ముఖం మెరుస్తూ ఉంటుంది.

ముల్తానీ మట్టి + బంగాళా దుంప

చర్మం తళ తళ మెరిసిపోవాలంటే బంగాళ దుంపకు ముల్తానీ మట్టి తోడు కావాల్సిందే.

multani matti aloo

ఒక టీ స్పూను బంగాళాదుంప రసంలో ఒక  స్పూను ముల్తానీ మట్టిని కలపండి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని అరగంట ఆరనీయండి.

గోరువెచ్చటి నీటితో ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడగండి.

దీనితో మీ ముఖం ఫ్రెష్‌గా కనిపించడమే కాకుండా మిలమిలా మెరిసిపోతుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్‌ను (Rose Water) టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Rose water

టోనర్ అనేది చర్మం నుండి మలినాలను తొలగించడం చేసి చర్మాన్ని మరింత శుభ్రపరుస్తుంది.

మీరు ముఖంలోని ధూళిని ,మలినాన్ని వదిలించుకోవాలనుకుంటే, ప్రతీ రోజూ మీ ముఖాన్ని రోజ్ వాటర్ తో తుడవవచ్చు.

ఇది ఒత్తిడితో కూడిన చర్మానికి మంచి ఉపశమనం కలిగించి , చర్మపు చికాకును తగ్గిస్తుంది మరియు చర్మం ప్రకాశవంతంగా మరియు యవ్వనంగా కనిపిస్తుంది.

కొబ్బరి నూనె

సౌందర్య సాధనాలలో కొబ్బరి నూనె (Coconut oil) అతి పురాతన కాలం నుండి  ఉపయోగించేది అని మన అందరికి తెలిసిందే  .

Coconut oil

ఈ కొబ్బరి నూనె జుట్టుకి మంచి పోషణ ఇవ్వడమే కాకుండా, పొడి చర్మం సమస్యను కూడా  తగ్గిస్తుంది,మరియు చర్మంలో తేమను నిలుపుకుంటుంది.

అది కూడా శీతాకాలంలో చర్మం మరింత పొడిగా మారుతుంది. అలాంటి పొడి చర్మం కొన్నిసార్లు చికాకును కలిగిస్తుంది.

కొబ్బరి నూనెను తలపై మాత్రమే కాకుండా చేతులు,కాళ్ళపై కూడా రాయడం ద్వారా పొడిబారిన చర్మం మంచి సిల్కీగా మారుతుంది.

ఈ సహజ చిట్కాలని పాటించి చర్మాన్ని మరింత యవ్వనం గా ఉంచుకొని అందంగా ,ఆనందం గా జీవించండి .