వేస‌వి కాలం(Summer Season) రానే వ‌చ్చింది. పగటిపూట ఉష్ణోగ్రతలు(Temperature) రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఈ సీజ‌న్‌లో పిల్ల‌ల ఆరోగ్యం(Kids Health) కోసం త‌ల్లిదండ్రులు ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్త‌లు(Precautions) తీసుకోవాలి.

మ‌రి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా!

వేస‌వి కాలంలో చాలా మంది పిల్లలు ఆట‌ల్లో ప‌డిపోయి వాట‌ర్‌ను తీసుకోవ‌డం మ‌ర‌చిపోతుంటారు. దాంతో  డీహైడ్రేష‌న్‌(Dehydration)కు గుర‌వుతుంటారు. అందుకే త‌ల్లిదండ్రులు ఎప్పటిక‌ప్పుడు పిల్లల చేత వాట‌ర్‌(Water)ను తాగించాలి. కొబ్బరి నీళ్లు(Coconut Water), పండ్ల రసాలు(Fruit Juice), మ‌జ్జిగ‌(Butter Milk), రాగి జావ‌(Ragi Java), సబ్జా వాట‌ర్(Sabja Water) వంటి వాటినీ పిల్లల‌కు ఇవ్వాలి.

త‌ద్వారా పిల్లల శ‌రీరంలో నీటి స్థాయిలు ప‌డిపోకుండా ఉంటాయి. అలాగే వేస‌విలో పిల్లల‌కు మంద‌పాటి బ‌ట్టలను పొర‌పాటున కూడా వేయ‌రాదు. మందంగా ఉండే దుస్తులు శరీరాన్ని మ‌రింత‌ వేడెక్కించేస్తాయి.

స‌మ్మర్‌లో చాలా మంది పిల్లలు డ‌యేరియా(Diarrhea) బారిన ప‌డుతుంటారు. ఈ స‌మ‌స్య నుంచి పిల్లల‌ను ర‌క్షించుకోవాలంటే. ఇంట్లో వండిన తాజా ఆహారాల‌నే పిల్ల‌ల‌కు పెట్టాలి. మండే ఎండ‌ల్లో వారిని ఆట‌ల‌కు పంప‌రాదు.ఉదయం, లేదా సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉండే సమయంలోనే పిల్లలను ఆరుబయట ఆడనివ్వాలి.

స‌మ్మర్‌లో కూల్ డ్రింక్స్‌(Cool Drinks), ఐస్‌క్రీమ్స్‌(Ice Creams), నూనెలో వేయించిన‌ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, కూలింగ్ వాట‌ర్, స్వీట్స్‌ వంటి వాటికీ పిల్లల‌ను దూరంగా ఉంచాలి. వాటి బ‌దులు తాజా ఆకుకూర‌లు, పెరుగు, తాజా పండ్లు, చక్కెర జోడించ‌ని స్మూతీలు(Smoothies), సీఫుడ్‌, స‌లాడ్స్(Salads) వంటివి ఉండేలా చూసుకోవాలి.

ఇక వేసవి వేడి ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేందుకు ఏసీల్లోనే గంట‌లు గంట‌లు వారిని ఉంచ‌డం కూడా క‌రెక్ట్ కాదు.అలా చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అందుకే నిత్యం ఏసీ(AC)లో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పదినిమిషాల పాటైనా గడ‌పాలి.

వేసవిలో వండిన పదార్థాలు త్వరాగా చెడిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టి.. తీసిన వెంటనే తింటే చల్లని పదార్థాలు(Chilled Foods) ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పిల్లలకు ఇవి పెట్టకూడదు. పిల్లల్లో వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు ఫ్రిజ్‌ నీళ్లు తాగితే జలుబు(Cold) చేసే అవకాశం ఉంది. కుండ నీళ్లు ఇవ్వడం చాలా మంచిది.

బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చిన్నారులకు తేలికైన, కాటన్‌ వస్త్రాల(Cotton Clothes)ను వేయాలి. ఇవి సింథటిక్‌, ఇతర ఫ్యాబ్రిక్స్‌ కంటే చెమటను ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మీ పిల్లలకు లేత-రంగు దుస్తులను వేయండి.

ఇంట్లో వీలైనంత గాలి వచ్చేలా చూడాలి. అధిక వేడి వల్ల ఉక్కపోత, చెమటతో పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. కాబట్టి ఎక్కువ గాలి తగిలేలా చూడాలి. రెండు పూటలా స్నానం చేయించాలి. బయట ఆటలాడి పిల్లలకు ఎక్కువగా చెమట పడుతుంది. నిర్లక్ష్యంగా వదిలేస్తే అలర్జీలు(Allergies) వచ్చే అవకాశం ఉంది.

మీ పిల్లలు ఎండల్లో బయటకు వచ్చినప్పుడల్లా కూలింగ్‌ గ్లాసెస్‌(Cooling Glasses) పెట్టుకునేలా చూడండి. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే సూర్యుని కిరణాలు డైరెక్ట్‌గా కళ్లల్లో పడవు, కళ్లు సేఫ్‌గా ఉంటాయి. కుదిరితే క్యాప్‌ పెట్టుకుంటే ఇంకా మంచిది ఎండ డైరెక్ట్ గా వారి తల మీద పడదు. ఎండ తలమీద పడితే.. తలనొప్పి, విసుగు, కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది.

బయట నుంచి ఇంటించి వచ్చిన తర్వాత చల్లటి నీళ్లోతో కళ్లు శుభ్రంగా కుడిగితే వారికి ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు బయటకు వెళ్లేప్పుడు అతిగా ఎక్స్ పోజ్ అయ్యే భాగాలకు సన్‌స్క్రీన్ లోషన్‌(Sun Screen Lotion) రాయడం మంచిది. సన్‌ స్క్రీన్ కనీసం SPF 30 ఉండేలా చూసుకోండి .

సన్‌ స్ట్రీన్ పిల్లలను సన్‌బర్న్‌(sun burn) నుంచి రక్షిస్తుంది. మీ పిల్లలు బయట ఉండే సమయం బట్టి సన్‌స్క్రీన్‌ రెండు సార్లు రాసినా పర్వాలేదు. ఈత కొట్టడం(Swimming), చెమట(Sweat) ఎక్కువగా పట్టినప్పుడు సన్‌ స్క్రీన్‌ను తొలగిపోతుంది.