వైద్యo లో భాగంగా ఎన్నో వైద్య పరీక్షలలో నొప్పి తెలియకుండా ఉండడానికి ఎన్నో పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. రోగి క్షేమం కోసం డాక్టర్లే వీటిని సూచిస్తుంటారు కూడా. అయితే పెయిన్ కిల్లర్స్ అన్నింటిలో రారాజు మాత్రం మార్ఫైన్. అసలు దీనిని కనుగొని కొన్ని దశాబ్దాలు దాటింది. దీనిని కనుగొన్న నాటి నుంచీ ఇది వైద్య విధానాన్ని పూర్తిగా మార్చేసింది అని ఈనాటికీ కొంత మంది వైద్య పరిశోధకులు అభిప్రాయ పడుతుంటారు. కానీ ఏ పెయిన్ కిల్లర్ అయినా సరే ఎక్కువ కాలం వాడకూడదు. దాని వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉంటుంటాయి. అలాంటిది ఈ మార్ఫైన్ కైతే శిక్షణ కలిగిన సిబ్బంది ద్వారా మాత్రమే దీనిని ఉపయోగించాలి. ఏ మాత్రం ఎక్కువైనా ఇది మృత్యువుకు కూడా కారణమవుతుంది.

అలాంటి ఈ మార్ఫైన్ ను మించిన పెయిన్ కిల్లర్ కోసం ఎంతో మంది పరిశోధకులు కొన్ని ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు వారి కృషి ఫలించే సమయం ఆసన్న మయింది. అమెరికా లోని University of California కు చెందిన ప్రొఫెసర్ Brian Shoichet బృందం చేసిన ఒక పరిశోధనలో మార్ఫైన్ ను మించిన పెయిన్ కిల్లర్ ను కనుగొన్నారు. అది కూడా మార్ఫైన్ మాదిరి దుష్ప్రయోజనాలు లేనిది అలాగే అది వ్యసనం గా కూడా పరిణమిoచనిదీ కావడం విశేషం. దీనికంటే ముందుగా మనం అసలు మార్ఫైన్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి.

మార్ఫైన్ అనేది మన మెదడు కణాల మీద ప్రభావం చూపుతుంది. మార్ఫైన్ molecules అక్కడి కణాలకు అంటుకోవడం తోనే ఒక చైన్ రియాక్షన్ కు కారణమవుతుంది. తద్వారా ఆ నరాన్ని నొప్పికి స్పందించని విధంగా లేదా మొద్దు బారేట్టు చేస్తుంది. దీనితో అక్కడి నరాలు నొప్పికి స్పందించడానికి తీవ్ర జాప్యం జరగడంతో మనకు తగినంత సమయం నొప్పి తెలియకుండా ఉంటుంది. సరే, ఇక Brian బృందం సరిగ్గా ఇలాంటి ప్రభావం కోసమే కొన్ని కోట్ల డ్రగ్స్ ను ఒక శక్తివంతమైన కంప్యూటర్ software ద్వారా కేవలం రెండు వారాల్లో 4 ట్రిలియన్ ప్రయోగాలు చేసారు. అలా చేయగా వారు 23 డ్రగ్స్ పైన వీరి దృష్టి పడింది. అటు పైన మరిన్ని పరీక్షల చేత ఒక కాంపౌండ్ ను వీరు కనుగొన్నారు. అదే PZM21. పరిశోధకులు అభిప్రాయం ప్రకారం ఇది మార్ఫైన్ ను మించిన శక్తివంతమైన పెయిన్ కిల్లర్ అనీ అది కూడా ఎంతో సురక్షితమైనదనీ పేర్కొంటున్నారు.

ప్రస్తుతానికి ఈ డ్రగ్ ను తయారు చేసి మనుషుల పైన పరీక్షించాలనీ ఆ తర్వాతనే ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి వస్తుందనీ Brian అంటున్నారు. ఈ పరిశోధన Nature జర్నల్ లో ప్రచురించబడింది.

Courtesy