ఈ తరం ఆడే వీడియో గేమ్ లకు ఒక నాటి వీడియో గేమ్ లకు అసలు పోలికే లేదు. అసలు వీడియో గేమ్ లు మొదలైన కొత్తలో అవి బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి. అలాగే వాటి సరంజామా అంతా విడిగా పెద్దవిగా ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం మన అరచేతుల్లోకి ఎంతో అద్భుతమైన గేమ్ లు వచ్చి చేరుతున్నాయి. అటు పైన ఇంటర్ యాక్టివ్ గేమ్ లు కూడా వచ్చేసాయి. అంటే మన ఆట తీరును బట్టి ఆట మారుతుంటుంది అన్న మాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయే IDV (Interactive Dynamic Video) మరొక ఎత్తు.

ఈ IDV అనే కొత్త సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని MIT (Massachussetts Institute of Technology) కి చెందిన Computer Science and Artificial Intelligence (CSAIL) కు చెందిన పరిశోధకులు రూపొందించారు. వీరేం చేసారంటే, ఒక సాధారణ కెమెరా లో బంధించిన ఒక వస్తువును మన కదలికలకు తగ్గట్టు స్పందించేట్టు చేయగలిగారు. ఉదా. ఒక సాధారణ కెమెరాతో ఫోటో తీయబడిన ఈ వీడియో లోని మనిషి ఆకారం కలిగిన ఒక వస్తువులో మనం స్పందనను కలిగించలేము. కానీ ఆ వస్తువును/మనిషి ఆకారపు బొమ్మ పక్కన మన చేతితో కొట్టడం ద్వారా ఆ తరంగాలు ఆ ఆకారాన్ని తాకుతాయి. ఇది మన కంటికి కనిపించదు. ఈ తరంగాలను (Vibrations) ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించడం వల్ల అది మన కదలికలకు ఎలా స్పందిస్తుందో కూడా కనిపెట్టవచ్చు. తద్వారా ఆ ఫోటో లోని వస్తువును ఈ ప్రత్యేకమైన కంప్యూటర్ software ద్వారా మన మౌస్ సహాయంతో దానితో ఎలా అంటే అలా ఆడుకోవచ్చు. అవును ఆడుకోవచ్చు.

సరిగ్గా ఇందుకే ఇది Virtual reality మరియు Augmented reality గేమింగ్ లో మరింత మెరుగైన గేమ్ లను రూపొందించడానికి ఇది సహాయ పడుతుంది. ఈ IDV తో కేవలం గేమింగ్ లోనే కాదు ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇక అన్నిటి కంటే అధికంగా ఇది హాలీవుడ్ వంటి సినిమా పరిశ్రమలలో అభూత కల్పన తో కూడిన సినిమాలలోని పాత్రలను అతి తక్కువ ఖర్చుతోనే ఇది రూపొందించగలదు.

చూద్దాం మరి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధ్యం కాబోతున్నాయో.

Courtesy