ఎప్పుడైనా ఒక సినిమా తారకు ఉన్న శరీర ధృడత్వాన్ని చూసి చర్చించుకోని వారు ఎవరుంటారు. అందుకు వారు ఫిట్నెస్ ట్రైనర్ మరియు డైటీషియన్ సహకారంతో అది సాధిస్తారు. ఆ శిక్షకులు కూడా వ్యక్తిగత శ్రద్ధ, సూచనల ద్వారా కోరుకున్న శరీరాకృతిని సాధించేలా సహాయపడతారు. ఇప్పుడు కొంచెం శ్రద్ధతో, వ్యాయామం తో మార్కెట్లో దొరికే వేరబుల్స్ ద్వారా ఎవరైనా ఇలాంటి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. అందుకోసం చాలా వేరబుల్స్ మార్కెట్లో ఉన్నా ఇప్పుడు చెప్పబోయేది మాత్రం అన్నిట్లోకి వైవిధ్యంగా నిలుస్తుంది. అదే ఈ RocketBody వేరబుల్ ఫిట్నెస్ బ్యాండ్. ఒక క్రీడాకారుడి అన్వేషణ నుంచి పుట్టిన ఈ వేరబుల్ ఫిట్నెస్ బ్యాండ్ విశేషాలేంటో చూద్దామా.

సరే ముందుగా ఎప్పుడైనా వ్యాయామానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు మీ శరీరం అందుకు సహకరించకపోవడం ఎప్పుడైనా గమించారా. ఒక్కోసారి శరీరం ఎక్కువ వ్యాయామం చేయగలదు, ఒక్కో సారి అసలు కనీసం కూడా చేయలేకపోవడం అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. దీనికి కారణం మనం తీసుకున్న ఆహారం, జీర్ణక్రియ. దీనినే metabolic rate అని అంటారు. దీనికి వ్యాయామానికి అవినాభావ సంబంధం ఉంది. సరిగ్గా దీనిని ఆధారం చేసుకుని metabolic rate ను బట్టి వ్యాయామం చేసి ఉత్తమ ఫలితాలను పొందడానికి రూపొందించినదే ఈ RocketBody వేరబుల్ ఫిట్నెస్ బ్యాండ్. ఈ బ్యాండ్ వ్యక్తి యొక్క metabolic rate ను వైద్య స్థాయి EKG ద్వారా అంచనా వేసి, వ్యాయామ సమయాన్ని సూచిస్తుంది. అప్పుడు అత్యధికంగా కేలోరీలను కరిగించవచ్చు. దీనినే ‘Supercompensation’ అని ఫిట్నెస్ పరిభాషలో అంటారు. ఇందుకోసం ఈ band వ్యక్తి యొక్క శరీరకొలతలు, వ్యాయమ అవసరాలు, ఆహార అలవాట్లు, HRV (heart rate variability) వంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత వ్యాయమo, వ్యాయామ సమయం సూచిస్తుంది. అంతే కాదు ఈ band లోని AI (Artificial Intelligence) వ్యక్తిగత డైటీషియన్ లా సూచనలు చేస్తుంది. వీటిని పాటిస్తే అనుకున్న ఫిట్నెస్ లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదు అంటున్నారు దీని రూపకర్తల్లో ఒకరైన Timofei Lipsky.

ఈయన ఒక క్రీడాకారుడు. కానీ అనుకోని ప్రమాదం వల్ల కోలుకుంటూ తిరిగి తన అదివరకటి ఫిట్నెస్ సాధించే క్రమంలో EKG ద్వారా metabolic rate ను తెలుసుకోగలిగితే అది ఫిట్నెస్ కు త్వరితంగా ఫలితాన్నిస్తుంది అని తెలుసుకున్నారు. తన అనుభవానికి AI ఆధారిత డైట్ ను కూడా చేరిస్తే ఈ RocketBody ఫిట్నెస్ వేరబుల్ బ్యాండ్ మన ముందుకు వచ్చింది. మార్కెట్లో చాలా రకాల ఫిట్నెస్ బ్యాండ్లు ఉన్నా metabolic rate ను ఆధారం చేసుకుని వ్యాయామాన్ని, వ్యాయమ సమయాన్ని నిర్దేశించగలగడం దీని ప్రత్యేకత.
ఇది ఎలా పని చేస్తుందంటే, దీనిలో ఒకే ఒక్క బటన్ ఉంటుంది. దానిని వత్తితే EKG రీడింగ్ చూపిస్తుంది. ఆ EKG సిగ్నల్ ను దీనిలో ఉండే ఎలక్ట్రోడ్ metabolic rate లోకి మార్చుకుని వ్యాయామ సూచనలు చేస్తాయి. ఈ విధంగా బరువు తగ్గచ్చు, పెరగచ్చు, ఇంకా చాలా చేయచ్చు అంటున్నారు దీని రూపకర్తలు. అయితే ఈ RocketBody వేరబుల్ బ్యాండ్ ప్రస్తుతం Kickstarter క్రౌడ్ఫండింగ్ కాంపెయిన్ లో ఉంది. అంతా సజావుగా జరిగితే ఈ వేరబుల్ ఈ ఏడాది అక్టోబర్ నుండి అందుబాటులోకి రావచ్చు. దీని ధర కేవలం $99.

Courtesy