ప్రస్తుత కాలంలో ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఫోన్లు కాస్తా స్మార్ట్ అయ్యేసరికి వేగంగా బాటరీ అయిపోతోంది. సరిగ్గా ఈ ఫోన్ బాటరీ ని నిముషాల్లో చార్జ్ చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఇంత వరకు ఏ ఉత్పత్తి మార్కెట్లో లేదు. ఉన్నది ఒక్కటే ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ‘Power Bank’ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ దానిని మనతో పాటు ఎక్కడ పడితే అక్కడికి ఫోన్ ను జేబులో పెట్టుకున్నట్టు పెట్టుకుని రాలేకపోవడంతో దాని వినియోగానికి పరిమితి ఏర్పడింది. ఈ హద్దును చెరిపేసి మన అరచేతిలో ఇమిడే పవర్ బ్యాంకు ఉంటే. ఉంటే ఏంటి ఉంది, అదే ఈ QUIB.

QUIB smart power bank

QUIB smart power bank

on the go మనకు ఉపయోగపడే పవర్ బ్యాంకు ఈ QUIB. ఇది చతురస్రాకారంలో ఉండే చిన్న పవర్ బ్యాంకు. దీని బరువు కేవలం 60 గ్రాములు. దీనిలో power bank, USB cable, memory drive కూడా ఉండడంతో మన ఫోన్ అవసరాలు అన్నీ మన చేతుల్లో వచ్చినట్టే. ఈ power bank ఒక iphone ను జీరో నుండి 50% కి ఛార్జ్ చేస్తుంది. ఇక దీనిని ఛార్జ్ చేసేటప్పుడు ఈ కేబుల్ ద్వారా ఈ పవర్ బ్యాంకు అలాగే మన ఫోన్ కూడా ఒకేసారి ఛార్జ్ కావడం ఒక అనుకూలాంశం. అలాగే దీనిలో ఒక లోపం ఏంటంటే అత్యల్పమైన బాటరీ. అది కేవలం 1500 mAh మాత్రమే. దీనితో హై ఎండ్ ఫోన్స్ అంటే గూగుల్ Nexus, iphones ఇత్యాదివి పూర్తిగా ఛార్జ్ కాలేవు. వీటికి దిగువ తరగతి ఫోన్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ QUIB రెండు వెర్షన్లలో లభ్యం అవుతోంది – ఆండ్రాయిడ్, iphone. ఇక దీని ధర $29 నుండి $35 ఉంటుంది.