అంతర్జాలం (ఇంటర్నెట్), వైఫై ద్వారా అంతర్జాలం ఇప్పుడు ప్రతీ ఊళ్లోనూ దొరుకుతోంది. ఈ అంతర్జాలం వచ్చాక మనకు మరింత దగ్గరైన వినోదం సినిమా. మన ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి విదేశీ చిత్రాల వరకు అన్ని మన ఫోన్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ అంతర్జాలం ప్రత్యక్షంగా చిత్ర పరిశ్రమను ఎంతో ప్రభవితం చేస్తోంది. సరే, అందుకు కారణం సహజంగా ఎవరికైనా సినిమాలు లేదా వినోదాత్మక వీడియోల మీద ఉండే మోజే.

అంతర్జాలంలో సినిమాలు ఇతర వీడియోలను ఫోన్ ను చేతుల్లో పట్టుకుని చూడటం ప్రతీ ఒక్కరికీ అనుభవమే. అలా కాసేపు కూర్చుని ఇంకాసేపు మరో భంగిమలోనో ఫోన్లో వీడియోలు చూసేస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రం సౌకర్యంగా ఉండదు, చూసినంత సేపు తెలియదు కానీ ఆ తరువాత మెడ నొప్పి లేదా నడుము నొప్పి బాధిస్తుంది. ఇక పై ఇలాంటి అవాంతరాలకు స్వస్తి చెప్పి, మీకు నచ్చిన సినిమాలు లేదా వీడియోలను అత్యంత సౌకర్యవంతంగా, థియేటర్ స్థాయి ప్రమాణాలతో చూసే సౌకర్యం కల్పిస్తుంది Poptheatr.

ఈ Poptheatr చూడడానికి ఒక నల్లని బట్టతో తయారు చేసిన బక్కెట్ లా ఉంటుంది. ఈ నల్ల రంగు బయట కాంతి థియేటర్లో పడకుండా చూస్తుంది, ఆ పైన ఈ క్లాత్ పూర్తిగా breathable polyesters తో తయారు చేయబడి, లోపలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనిని పడుకుని మన తల పై పెట్టుకుoటే దానికి పై భాగంలో ఒక స్క్రీన్ ఉంటుంది. థియేటర్ లోకి వెళ్ళే ముందు ఈ బకెట్ వెలుపల పై భాగంలో రెండు స్ట్రాప్స్ ఉంటాయి. దాన్లో మీ ఫోన్, ఆ థియేటర్ స్పీకర్ ఈ వీడియోలో చూపించిన విధంగా అమర్చి, దీనిని పడుకుని మీ తల పై భాగంలో పెట్టుకోవాలి. ఇక ఫోన్లోని వీడియో ఉపయోగించడానికి ఒక రిమోట్ ఉంటుంది. దానితో వీడియో ప్లే చేసే అన్ని ఆప్షన్స్ ను మీరు నియంత్రిస్తూ నిజంగా థియేటర్ వంటి అనుభవాన్ని మీకు కలిగిస్తుంది ఈ Poptheatr. అంతే కాదు ఏదైనా ఒక థియేటర్ లో ముఖమైనది అకౌస్టిక్స్ (sound system). సరిగ్గా, ఈ Poptheatr లో శబ్దం బయటకి పోకుండా బయట శబ్దాలేవీ మిమ్మల్ని తాకకుండా ఈ థియేటర్ ను సీల్ చేయడానికి ఒక జిప్ ఉంటుంది. అది వేస్తే ఇక మీ వ్యక్తిగత సినిమా ఆరంభం అయినట్టే. అది ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడండి.
ఇలా వ్యక్తిగత థియేటర్ అనుభవాన్నిచ్చే మొట్ట మొదటి పరికరం ప్రస్తుతానికి ప్రపంచంలో ఈ Poptheatr ఒక్కటే. మనకు హోం థియేటర్స్ ఉన్నా అవి అన్నీ పెద్ద పెద్ద టీవీలు, స్పీకర్లు కలిగి ఎంతో ఖరీదైనవి.

ఈ Poptheatr మరో ప్రత్యేకత ఏంటంటే, ఇది పూర్తిగా పోర్టబుల్. దీనిలో స్క్రీన్, ఈ బకెట్, రిమోట్, వంటివన్నీ అతి తేలికగా తయారు చేసారు. వీటిని మడిచి ఏదైనా బాగ్ లో పెట్టుకుని మీతో తీసుకెళ్ళే విధంగా ఉంటుంది. ఈ Poptheatr స్పీకర్ బ్లూటూత్ ద్వారా మీ tablet/ఫోన్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. అంతే కాదు ఈ స్పీకర్ కేబుల్ తో మీ ఫోన్/tablet ను ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అలా ఏదైనా వీడియో చూసేటప్పుడు ఛార్జింగ్ గురించిన బెంగ అవసరం లేదు. ఇలా మీకు కావాల్సిన ప్రైవసీ ఈ theatr ఇస్తుంది, కానీ ఇది చూడడానికి కొంచెం వింతగా ఉంటుంది. కానీ ఈ పరికరం ఇచ్చే సౌకర్యం ముందు అది పట్టించుకోనవసరం లేదు అనిపిస్తుంది.
ఈ సృజనాత్మకమైన పర్సనల్ థియేటర్ ను అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధులు తయారు చేసారు. దీని ధర $112.