ఆరెంజ్‌(Orange)ని చూడగానే నోటిలో నీళ్లు ఊరతాయి. దీని పుల్లని తీపి రుచి నాలుకకు ఉపశమనం(Relax) కలిగించడమే కాకుండా, దానిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, దీనిని తిన్న వెంటనే లేదా దాని రసం త్రాగిన వెంటనే శరీరం, మనస్సులో చల్లదనం నిండి ఉంటుంది.

అలసట(Tired) , టెన్షన్(Tension) కూడా దూరమవుతాయి. ఆరెంజ్ మనస్సును తాజాదనంతో నింపుతుంది. ఇది ఆసియా పండు. ఇది భారతదేశంలో ఉద్భవించిందని ఆధారాలు సూచిస్తున్నాయి. నారింజను చాలా మంది జ్యూస్ చేసుకుని తాగుతారు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీ సీజన్(Season) లో ఇష్టపడుతుంటారు. అయితే చలికాలంలో  దీనిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

ప్రతీ రోజు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ( Health ) మీ సొంతం అవుతుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఇది బ్రెజిల్‌(Brazil)లో ఎక్కువగా పెరుగుతుంది, తర్వాత చైనా, అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది. ఆరెంజ్ నిజానికి హైబ్రిడ్(Hybrid) జాతికి చెందిన పండు. ఇది ద్రాక్షపండు, నారింజ కలపడం ద్వారా తయారు చేయబడింది. కాబట్టి ఇందులో విటమిన్ సి(Vitamin C), ఏ పుష్కలంగా ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 రకాలు ఉన్నాయి. బాదం వంటి వాటిని పండించడానికి చాలా నీరు ఉపయోగించాలి. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, నారింజ పండించడంలో 14 గ్యాలన్ల నీరు వినియోగిస్తారు. పండ్ల రసంలో ఎక్కువ భాగం నారింజ మాత్రమే తాగుతారు. దాదాపు 140 గ్రాముల ఆరెంజ్‌లో శరీరానికి రోజుకు అవసరమైన 92% విటమిన్ సి లభిస్తుంది.

నారింజ చెట్టు యొక్క పువ్వులు తెలుపు రంగులో అద్భుతమైన వాసన కలిగి ఉంటాయి. నారింజ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది, ప్రపంచంలోని నారింజ రసంలో దాదాపు సగం,ప్రపంచంలోని నారింజలో 80% బ్రెజిల్ ఉత్పత్తి చేస్తుంది.

తాజా నారింజను తినడం వల్ల తాజాదనం అనుభూతి కలుగుతుంది. అందు్కే పొద్దునే ఆల్పాహారం ( Breakfast) పూర్తి చేసిన తరువాత లేదా మధ్యాహ్నం భోజనం(Lunch) అయ్యాక ఒక గ్లాసు ఆరెంజ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే, నారింజ పండు పోషకాలలో మెండు అంటారు.

ఇందులో చాలా తక్కువ పాళ్లలో కేలరీస్(Calories) ఉంటాయి. నారింజలో ఎలాంటి సెచ్యురేటెడ్ ఫ్యాట్(Saturated Fat) లేదా కొలెస్ట్రాల్(Cholesterol) ఉండదు. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్(Dietary Fiber) కూడా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఉన్న విషతుల్యాలు బయటికి వెళ్లిపోతాయి. ఆరెంజ్ ( Orange ) వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా, చక్కగా పని చేయడం మొదలు పెడుతుంది. నారింజలో అత్యధిరంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ఫ్రూట్(Citrus Fruit).  సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

నిమ్మకాయ(Lemon), బత్తాయి(Moosambi) కూడా సిట్రస్ ఫ్రూట్సే. సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidants) తత్వాలు నారింజలో ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. స్డామినా(Stamina) పెంచుతుంది. ఇందులో ఫైబర్ విమటిన్ సీ కూడా అధికంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు పెరిగే(Weight gain) సమస్యను చెక్(Check) పెట్టవచ్చు.

నారింజ వల్ల విటమిన్ బీ కాంప్లెక్స్(Vitamin B Complex) కూడా ఎక్కువగా లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్(Hemoglobin) శాతాన్ని పెంచుతుంది. రక్తపోటును నియంత్రించడం(Controls BP)లో నారిజలో ఉండో పోషకతత్వాలు ఉపయోగపడతాయి. ఎముకుల పటిష్టం(Strong Bones) అవుతాయి.