స్నాక్స్(Snacks) అంటే ఎవరికీ ఇష్టం వుండదు. అందులోను కట్లెట్స్(Cutlets) అంటే అందరికి చాలా ఇష్టం ఉంటుంది. క్రిస్పీ(Crispy) గా, వుండే కట్లెట్స్ కాస్త రొటీన్(Routine) కి బిన్నంగా రైస్ తో కట్లెట్స్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

ఈ రైస్ కట్లెట్స్(Cutlets) ఎంతో  రుచి గా ఉంటుంది, దీన్ని తయారు చేసుకోవడం కూడా అంతే సులువు(Easy)గా ఉంటుంది.

మరి అన్నం కట్లెట్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

1 కప్పు వండిన అన్నం

½ కప్ ఉడికించి స్మాష్ చేసిన పెద్ద బంగాళాదుంప

⅓ కప్పు తరిగిన ఉల్లిపాయ

1 పచ్చిమిర్చి తరిగినది

2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు

1 చిటికెడు పసుపు పొడి (నేల పసుపు)

¼ టీస్పూన్ ఎర్ర మిరపకాయ

½ టీస్పూన్ జీలకర్ర పొడి (నేల జీలకర్ర)

½ టీస్పూన్ కొత్తిమీర పొడి (నేల కొత్తిమీర)

¼ నుండి ½ టీస్పూన్ గరం మసాలా

3 టేబుల్ స్పూన్ బేసన్ (గ్రామ పిండి)

ఉప్పు తగినంత

3 టేబుల్ స్పూన్లు వేయించడానికి నూనె

రైస్ కట్లెట్ తయారు చేయు విధానం

  • ఒక్క గిన్నెలో నూనె తప్ప అన్ని పదార్థాలను తీసుకోండి.
  • అన్నిటిని బాగా మిక్స్ చేయండి. అందులో రైస్ ని కూడా కలిపి బాగా మెత్తటి ముద్దలా చేసుకోండి లేదా మిక్స్ లో వేసి మెత్త గా గ్రైండ్(Grind) చేసుకోండి.
  • ఈ మిశ్రమాన్ని(Mixture) మీడియం సైజు(Medium Size) లో టిక్కీలుగా తయారు చేసుకోవాలి.
  • స్టీవ్ మీద ఒక పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రై(Deep Fry) కి సరిపడా ఆయిల్ వేసి ముందుగా తయారు చేసుకున్న రైస్ కట్లెట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.
  • సన్నని మంట మీద కట్లెట్స్ గోల్డెన్ కలర్(Golden Color)  వచ్చేవరకు వేయించాలి.
  • కొత్తిమీర చట్నీ(Coriander Chutney) లేదా పుదీనా చట్నీ(Mint Chutney) లేదా టొమాటో కెచప్‌(Tomato Ketchup)తో రైస్ కట్‌లెట్‌లను వేడిగా సర్వ్(Serve) చేయండి. ట్రస్టీ, క్రిస్పీ రైస్ కట్లెట్స్ రెడీ.