పెసలు(Moong Dal) భారతీయుల ఆహారం(Indian Food). మన దేశంలో పూర్వీకుల(Ancestors) నుంచి వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా(World Wide) మూంగ్ దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్(Snack Item) పెసలే. ఇంతకీ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం! పెసలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది పులగం. కూరల్లో పెసలను వాడుతారు.

పెసర దోశ రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు(Moong Sprouts), మూంగ్‌దాల్‌కు మార్కెట్‌(Market)లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ ఇష్టమే. మొలకెత్తిన విత్తనాలు రోజు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు (Benefits)చేకూరుతాయి.

ఉదర సమస్యలను తగ్గడం సహా గుండెకు ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ(Immunity System) మెరుగయ్యేందుకు ఈ మొలకెత్తిన విత్తనాలు సహకరిస్తాయి. అయితే ఈ మొలకెత్తిన విత్తనాలను ఉదయాన్నే ఖాళీ కడుపు(Empty Stomach)తో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనమని తెలుస్తోంది.

పెసల్లో విటమిన్ బి, సి,(Vitamin B,C) మాంగనీస్‌(Manganese)తోపాటు ప్రోటీన్లు(Proteins) అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు(Blue rays), పర్యావరణ కాలుష్యం(Environmental pollution) వల్ల వచ్చే చర్మ సమస్యలు(Skin Problems) పెసలు ఆహారంగా తీసుకోవడం వల్ల తొలగిపోతాయి.

అంతేనా.. ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది. సున్నిపిండి తయారీలో పెసలను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం పెరుగుతుంది. పెసలు హైబీపీ(High BP)ని తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌(Bad Cholesterol)ను దూరం చేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు(Heart Attack) వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పెసలు తింటే ఆరోగ్యంతోపాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు(scientists) అంటున్నారు.

పెసలలో ఐరన్(Iron) పుష్కలంగా ఉంటుంది. రోజు వారీ ఆహారంలో పెసల్ని భాగం చేసుకుంటే అనీమియా(Anemia) తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే(Weight Loss) వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలను కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గవచ్చని పరిశోధనలు(Research) చెబుతున్నాయి.

డయాబెటిస్‌(Diabetes)ను క్రమబద్దీకరించడాని(Controls)కి పెసలు ఉపయోగపడతాయి. క్యాన్సర్(Cancer) బారిన పడకుండా చేస్తాయి. జీర్ణం సులువుగా అయ్యేందుకు సహాయపడే ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. పెసలు తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత(Hormonal balance) దెబ్బ తినదు.

కండరాల నొప్పి(Muscle Pain), తలనొప్పి(Head Ache), నీరసాన్ని(Weakness) తగ్గించే గుణం వీటికి ఉంది. రోజు వారీ మెనూ(Menu)లో పెసలు(Moong) ఉండడం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్ నాశనం(Destruction of chemicals) అవుతాయి. కంటి చూపు సమస్యలు(Eye sight Problems) దరి చేరవు.