చీజ్ బ్రెడ్ ఆమ్లెట్(Cheese Bread Omelet), మనం రొటీన్ గా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్‌తో సమానమైన ఒక స్ట్రీట్ ఫుడ్(Street Food), కానీ చీజ్ చేర్చడంతో మరింత రుచి(Taste)గా ఉంటుంది.

ఖచ్చితమైన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను పొందడానికి, కొన్ని చిట్కాల(Tips)ను ఫాలో అయితే ఎంతో టేస్టీ, హేలదీ(Healthy) బ్రెడ్ ఆమ్లెట్‌ను ఆస్వాదించవచ్చు.

మరి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా!

కావాల్సిన పదార్ధాలు

గుడ్లు – 6
ఉల్లిపాయ తరుగు – 1/2 కప్
సన్నగా తరిగిన కాప్సికం – 1/4 కప్
పచ్చిమిర్చి తరుగు – 2
టమాటో తరుగు – 1/4 cup
ఉప్పు
పసుపు
మిరియాల పొడి – 1/2 tsp
చిల్లి ఫ్లెక్స్ – 1 tsp
బ్రేడ్ స్లైసెస్ – 6
చీస్ స్లైసెస్ – 6
బట్టర్ – బ్రేడ్ టోస్ట్ చేసుకోడానికి ఇంకా ఆమ్లెట్ కి

తయారు చేసే విధానం:

• కొద్దిగా బటర్(Butter) వేసి బ్రేడ్ని రెండు వైపులా టోస్ట్(Toast) చేసుకోవాలి.
• ఎగ్స్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి బాగా నురగగా వచ్చేదాకా బీట్ చేయాలి.
• తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా బీట్(Beat) చేసుకోవాలి.
• నాన్ స్టిక్ పాన్ మీద బటర్ కరిగించి పెద్ద గరిటెడు ఎగ్ మిశ్రా మిశ్రమాన్ని పోసి పెనం అంతా స్ప్రెడ్ చేయాలి.
• వెంటనే పైన 2 టచ్ చేసిన బ్రేడ్ ఉంచి ఎగ్ మిశ్రమాన్ని రెండు వైపులా అంటించాలి.
• 30 సెకన్లు ఆమ్లెట్ని కాలనిచ్చి బ్రేడ్ మీద చీస్ స్లైసెస్ (Cheese Slices) పెట్టి ఆమ్లెట్ అంచులని బ్రేడ్ మీదికి వేయాలి, తరువాత బ్రేడ్ ని మధ్యకి అంటే ఒకదాని మీదికి మరొకటి వేసేయాలి.
• మధ్యకి మదించిన బ్రేడ్ ని రెండు వైపులా 30 సెకన్లు మాత్రమే టోస్ట్(Toast) చేసుకోవాలి. వేడి మీదే మధ్యకి కట్ చేసుకోవాలి.

• వేడిగా టమాటో సాస్(Tomato Sauce) తో తింటుంటే అదిరిపోతుందని టేస్ట్.