తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టుల(Group 1 Posts)ను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మార్చ్ 23న ఈ ఖాళీల (Telangana Government Jobs) భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ విడుదల చేసింది.

త్వరలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్(Notification Release) విడుదల చేయనుంది. 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన(TS Formation) నాటి నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక్క సారి కూడా విడుదల కాలేదు. ఏపీ(AP)తో పోస్టుల విభజన పూర్తి కాకపోవడం కారణంగానే గ్రూప్ 1 ఖాళీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేకపోయామని ప్రభుత్వం తెలిపింది.

అయితే, తాజాగా 503 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్9CM KCR) ప్రకటించారు.

ఈ మేరకు తాజాగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో టీఎస్పీఎస్సీ (TSPSC )నుంచి త్వరలోనే ఉదోయగ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

అయితే.. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అవుతుండడంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. వయో పరిమితిని(Age Limit) కూడా సడలించడం(Extended)తో లక్షల్లో అభ్యర్థులు పోటీ ఉండచ్చు.

గ్రూప్ 1లో విభాగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 503

డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్-5

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-20

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP)-౯౧

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-2

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-8

డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-2

డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్-6

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్-26

డిస్ట్రిక్ట్ రిజిస్టార్-5

డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3

రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్-4

డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2

మున్సిపల్ కమిషనర్-Gr.2 35

మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్-121

డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్-5

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48

డిప్యూటీ కలెక్టర్-42