బి.ఎడ్ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు తెరపడింది, ఎట్టకేలకు సీటెట్ నోటిఫికేషన్(CTET Notification) విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షా తేదీలు ఖరారైంది.

సీటెట్ పరీక్షా ఆన్లైన్ మోడ్ లో జరగనుంది.16 డిసెంబర్ 2021, నుంచి 13 జనవరి 2022, వరకు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షా 20 భాషల్లో జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్ సైట్లో సమాచార బులెటిన్ ను  డౌన్లోడ్ చేసుకుని ఒకసారి జాగ్రత్తగా చదివి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ తరువాత అప్లై చేసుకోవాలని సూచించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.

పరీక్ష, సిలబస్, అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుము, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన పూర్తి  సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌(Official Website)లో ఉంటుంది.

అభ్యర్థులు సీటెట్(CTET) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 20 నుంచి మొదలవుతుంది.

ఆన్‌లైన్‌(online)లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ19 అక్టోబర్ 2021.

ఫీజు 2021 అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చు.

ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/OBC అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి.

రెండు పేపర్‌లకు రూ.1200 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు (SC/ST/PWD) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌లకు రూ.600 ఉంటుంది.

సీటెట్(CTET) 2021 పరీక్ష కోసం ఎలా నమోదు చేసుకోవాలో? మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నమోదు ప్రక్రియ వివరాలు

  • అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయడానికి మొదట CTET, ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • వెబ్‌సైట్‌లో నమోదు కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్, అభ్యర్థించిన ఇతర సమాచారాన్ని సమర్పిచాలి.
  • తర్వాత లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పులు లేకుండా నింపాలి.
  • ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయాలి.
  • ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత చివరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.

అర్హత కలిగిన , ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ….