బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) షో లో మూడో వారం నామినేషన్(Nomination) ప్రక్రియ ఇచ్చి హౌస్ మేట్స్ మధ్య  రచ్చ రాజేసిన బిగ్ బాస్. ప్రియా, లహరి ల మధ్య జరిగిన హీట్ డిస్కషన్ అయితే  తార స్థాయికి చేరింది.

దీనితో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతోంది. గత వారం పందెం నిదా నాద అనే టాస్క్ తో నిప్పు రాజేసిన బిగ్ బాస్.

ఈ వారం ఇచ్చిన టాస్క్ తో కాస్త ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఫన్నీ గేమ్ ఆడిస్తున్న బిగ్ బాస్.

మరి ఈ టాస్క్ తో హౌస్ మేట్స్(House mates) ఏ మాత్రం పండించ గలరో చూడాలి. మరి ఆ ఎపిసోడ్ ని ఇక్కడ చూద్దాం.

జెస్సీ, నటరాజ్, మానస్లను నామినేట్(Nominate) చేశాడు. అయితే జెస్సీ నిర్ణయంతో విభేదించిన నటరాజ్ మాస్టర్, నువ్వు ఇప్పుడు నామినేషన్(Nomination) నీ అంతట నువ్వు  వేయలేదు.. ఒకరు చెప్తే చేశావ్ అని నాకు తెలుసు అని అన్నారు నటరాజ్.

అయితే నటరాజ్ మాస్టర్ అంతటితో ఆగకుండా జెస్సీ పై నోరుపారేసుకున్నాడు. నువ్వు  నా ముందు చిన్నపిల్లోడివి.. జూజూ పక్కకి వెళ్లి ఆడుకోమ్మా అని అంటూ ఎగతాళి చేసిన నటరాజ్ మాస్టర్.

అయితే జెస్సీ మాత్రం చాలా తెలివిగా స్పందించాడు.. ఎస్ నేను కిడ్ నే మాస్టర్ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

ప్రియని టార్గెట్ చేసిన హమీదా.. ప్రియను నామినేట్ చేస్తూ ఆమె ఎప్పుడూ తనని హర్ట్ చేస్తూనే ఉన్నారని..  నువ్వు  సర్జరీ చేయించుకున్నావా? అని బాడీ షేమింగ్ చేసిందని. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టింది..

ఇంత మంది చూస్తున్న ఈ షోలో నువ్ సర్జరీ చేయించుకున్నావా? అని అంటే చూసేవాళ్లు ఏం అనుకుంటారు అని ఎమోషనల్(emotional) అయ్యింది హమీదా. దీంతో ప్రియా మాట్లాడుతూ నువ్వు నన్ను తప్పు గా అర్ధం చేసుకున్నావ్ అని , ప్రియాంకకి సర్జరీ అయ్యింది కాబట్టి.. తనకి చిన్న గాయమైనా పెద్దగా నొప్పి వస్తుంది.. నువ్వు కూడా బాధపడుతుంటే ఏదైనా సర్జరీ అయ్యిందా అని అడిగాను అని చెప్తుంది ప్రియా .

అయితే హమీదా మాత్రం.. నేనేమీ  చిన్న పిల్లని కాదు.. మీ అంత పెద్ద సెలబ్రిటీని కాకపోవచ్చు కానీ.. నాలో ఏదో ఉంది కనుకనే ఇక్కడ హౌస్‌లో ఉన్నాను అని చెప్పి కోపంగా, ప్రియ పేరు వున్నా టైల్ ని పగలకొట్టి నామినేట్ చేసింది హమీదా.

అయితే హమీదా ప్రియపై కోప్పడడం తో రవితో పాటు మిగిలిన మెన్స్ క్లాప్స్ కొట్టారు.

ఈ మూడో వారం నామినేషన్స్‌ లో,  ప్రియ, లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామ్, మొత్తం ఐదురుగు ఎలిమినేషన్‌(elimination)కి నామినేట్ అయ్యారు.

ఆ తరువాత యాంకర్ రవి, ప్రియ, లహరి ల మధ్య  జరిగిన గొడవను క్లియర్  చేసుకోవడానికి ట్రై చేసారు. ముగ్గురూ కూర్చున్నప్పుడు నువ్వు అన్నావ్ కదా రవి..లహరి  యాంకర్‌గా ట్రై చేస్తోందని అని.. హెల్ప్ కోసం నీ వెంటపడుతుందని .. హౌస్‌లో సింగల్ మెన్  ఉన్నప్పటికీ పెళ్తైన నీ వెంటపడుతోందని.. అది ఎలా చెప్పాలో తెలియడం లేదని నువ్వు నాతో చెప్పావ్ కదా రవి అని అంటుంది ప్రియా.

దీనితో అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని వాడలేదని మాట మార్చేశాడు రవి. అయితే  సింగల్ మెన్ అనే పదం వాడినట్టు ప్రూఫ్ గా వీడియో ఉండడం  గమనార్హం.

అయితే నువ్వు అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంది ప్రియ. అయితే రవి మాత్రం నేను అనలేదని చెప్పడమే కాకుండా.. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రియ ఆలా చెప్పిందని తనని బ్యాడ్ చేస్తుందని లహరి తో అంటాడు .

ఆ తరువాత ప్రియ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ.. నేను తప్పుచేయలేదు.. జరిగిందే చెప్పా అని కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక ఉదయాన  కెప్టెన్సి టాస్క్‌(Captancy task)గా ‘హైదరాబాద్‌ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’అనే ఫన్నీ గేమ్‌ని ఇచ్చాడు బిగ్ బాస్(Bigboss). ఇందులో హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి, అమెరికాగా అబ్బాయిగా శ్రీరామ చంద్ర సెలెక్ట్‌ అయ్యారు.

ఇక అమ్మాయి మతి మరుపు మామయ్యగా రవి, అబ్బాయి మాజీ ప్రియురాలిగా హమిదాల ను ఎంపిక చేశాడు బిగ్‌బాస్‌. సెలైంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కుమ్యారేజ్‌ బ్రోకర్‌ క్యారెక్టర్‌ ఇచ్చాడు. వీరికి ఇచ్చిన రోల్స్ ను సిరి చదువుతూ ఉంటే హౌస్ లో అందరు  పడిపడి నవ్వుకున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమో లో తమకు ఇచ్చిన కేరక్టర్స్ లో హౌస్‌మేట్స్‌(Housemates) ఇన్వాల్వ్ అయ్యినట్లు తెలుస్తోంది. మామయ్య పాత్ర అనగానే రవి గెటప్‌ మార్చేశాడు. మ్యారెజ్‌ బ్రోకర్‌ పాత్ర లో ఉన్న షణ్ముఖ్‌తో బేరాలాడుతూ కనిపించిన మానస్‌. తనకు అమ్ము తో పెళ్లి కావాలని, ఎంత డబ్బులైనా తీసుకొని తన పెళ్లి జరిపించాలని కోరాడు.

దీనికి లోబో ‘పది కోట్లు కావాలి ఇస్తావా’అంటూ తనదైన శైలీలో సెట్టైర్ వేసాడు. చూస్తుంటే హౌస్ లో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. అయితే రవికి ఓ సీక్రెట్‌ టాస్క్‌ బిగ్‌బాస్‌(Big boss) ఇచ్చినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. కెప్టెన్సీ కంటెడర్‌ పోటీ దారులయ్యే అవకాశాన్ని ఒక సీక్రెట్‌ టాస్క్‌(secret task) ద్వారా కల్పిస్తున్నట్లు రవికి చెప్పి బయటకు పంపించాడు.

మరి రవికి ఇచ్చిన ఆ సీక్రెట్‌ టాస్క్‌ ఏంటి? అందులో రవి సక్సెస్ అయ్యాడా లేదా? తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ కోసం వెయిట్ చేయాల్సిందే .