కరోనా కారణంగా అన్ని రంగాల్లోనూ దాదాపు ఆర్ధికంగా పతనమైంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది.అయితే టెక్ నిపుణుల (Tech experts)అవసరం కూడా ఎక్కువ ఉంటుండగ, డిజిటల్ టెక్నాలజీ(Digital Technology)కి డిమాండ్ పెరగడంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు నియామకాలు భారీగా చేపడుతున్నాయి.

బెంగళూరు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys) కూడా ఫ్రెషర్స్(Freshers) కోసం నియామక ప్రక్రియ చేపట్టింది.  ఫ్రెషర్స్ కి  ఇది గోల్డెన్ అప్పుర్చునిటీ అనే చెప్పాలి.

దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఈ సంవత్సరం కంపెనీలో 45వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు నిర్ణయించుకుంది.

టెక్నికల్‌గా ఉద్యోగులను నియమించుకునేందుకు ఇప్పుడు ఐటీ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులను నియమించుకునేందుకు పోటీ పడుతుంది.

ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) ప్రవీణ్ రావు మాట్లాడుతూ, “మార్కెట్లో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, మేము ఈ సంవత్సరం కొత్తగా 45,000 కాలేజ్ గ్రాడ్యుయేట్‌ల(Graduates)ను నియమించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాము.

మా ఉద్యోగుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మ్యాన్ పవర్ పెంచాలని నిర్ణయించుకున్నాము, అలాగే వారి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలు పెంచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, వారికి సరైన వృద్ధి అవకాశాలు కల్పించే ప్రక్రియ చేపట్టినట్టు ఓ ప్రకటనలో  తెలిపారు.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్పోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) రెండవ త్రైమాసికానికి సంబంధించి ఇన్ఫోసిస్ బుధవారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

ఆర్థిక సంవత్సరంసెప్టెంబర్‌ ౩౦తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు కనబరిచింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.9 శాతం పెరిగి రూ .5,421 కోట్లకు చేరుకుందని, కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4,845కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది.

ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న అట్రిషన్ రేటు కారణంగా కొత్తగా కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది.

బీటెక్‌, ఎంసీఏ ఫ్రెషర్లకు క్యాప్ జెమిని లో ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు శుభవార్త . ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిసితో పాటు క్యాప్ జెమిని(Capgemini )  కూడా ఇంజనీరింగ్, ఎంసీఏ ఫ్రెషర్స్ కోసం నియామకాలు చేపడుతోంది.

క్యాంపస్ డ్రైవ్  2021 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.2021లో ఇంజనీరింగ్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి అక్టోబరు 15 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

నమోదు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ నెల రెండో వారం నుంచి అసెస్‌మెంట్‌ టెస్ట్(Assessment Test) నిర్వహిస్తారు. పూర్తి వివరాలను క్యాప్ జెమిని అధికారిక వెబ్‌సైట్‌(Official Website)లో చూడవచ్చు..