నిరుద్యోగుల‌(Un employees)కు శుభవార్త(Good news) తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) జాబ్‌ నోటిఫికేషన్‌(Job Notification) విడుదల(Release) చేసింది.

ఆర్టీసీ డిపోల్లో ప‌ని చేసేందుకు గ్రాడ్యుయేట్‌ (Engineering) అప్రెంటిస్‌(Apprentice), టెక్నిషియన్‌ (Diploma) అప్రెంటిస్‌ పోస్టుల శిక్షణ(Training)కు అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంజినీర్‌లు(Engineers), గ్రాడ్యుయేట్‌లు(Graduates), డిప్లోమా హోల్డర్‌లు(Diploma Holders) ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు(Application) చేసుకొనేందుకు అర్హులు.

ఈ అప్రెంటిస్‌ కాల వ్యవధి మూడేళ్లు.  అర్హత(Qualified), ఆసక్తి(Interested)గల అభ్యర్థులు(Candidates) జూన్ 15(June 15th) వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌(Official Website) చూడొచ్చు. అలాగే దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు యూజ‌ర్ ఐడీ: STLHDS000005

పూర్తి వివరాలివే:

అర్హతలు: ఏదైనా విభాగంలో బీఈ(B.E), బీటెక్‌(B.Tech)డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వేతనాలు: గ్రాడ్యుయేట్‌ (Engineering) అప్రెంటిస్‌ పోస్టులకు మొదటి ఏడాది రూ.18,000.. రెండో ఏడాది రూ.20,000.. మూడో ఏడాది రూ.22,000 వరకూ స్టైపెండ్‌(Stipend) ఉంటుంది.

టెక్నిషియన్‌ (Diploma) అప్రెంటిస్‌ పోస్టులకు మొదటి ఏడాది రూ.16,000.. రెండో ఏడాది రూ.17,500.. మూడో ఏడాది రూ.19,000 వరకూ స్టైపెండ్‌ ఉంటుంది.

TSRTC రీజియన్ల వారీగా ఖాళీలు:

హైదరాబాద్- 51

సికింద్రాబాద్- 36

మహబూబ్ నగర్- 27

మెదక్- 24

నల్గొండ- 21

రంగారెడ్డి- 21

ఆదిలాబాద్- 18

కరీంనగర్- 30

ఖమ్మం- 18

నిజామాబాద్- 18

వరంగల్- 27

ఎన్ఓయూ- 09

TSRTC అప్రెంటిస్‌ ఉద్యోగాలకు ఇలా దరఖాస్తు చేసుకోవాలి:

  • మొదట https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీ(Home Page)లో Register here ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్(Registration) పూర్తి చేయాలి.
  • ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్(Enrollment Verification), అప్రూవల్(Approval) కోసం ఒక రోజు వేచిచూడాలి.
  • వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తయిన తర్వాత మళ్లీ https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • లాగిన్ ఆప్షన్‌ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్(Login) కావాలి.
  • తరువాత ఎస్టాబ్లిష్‌మెంట్(Establishment) రిక్వెస్ట్ మెనూ(Request Menu) పైన క్లిక్ చేయాలి.
  • తర్వాత ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.
  • తదుపరి టీఎస్ ఆర్టీసీ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
  • తరువాత అప్లయ్‌ బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.