ఏపీ(AP)లో అంగన్‌వాడీల(Anganwadi)కు జగన్ సర్కార్ శుభ వార్త(Good News) చెప్పింది.  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్(Green Signal) ప్రకటించింది. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈవో), గ్రేడ్‌–2 (సూపర్‌వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌(Grade-2 Supervisor) పోస్టులు 976 ఉంటే.. వాటిలో 416 పోస్టులను ఇది వరకే భర్తీచేశారు.

అంగన్‌వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు పదోన్నతులు(Promotions) కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీ చేస్తారు.

వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ రిలీజ్(Notification release) కానుంది. రాష్ట్ర వ్యాప్తం(State Wide)గా విశాఖపట్నం జోన్‌(Vishakhapatnam Zone)లో 76 పోస్టులు, ఏలూరు(Elluru) జోన్‌లో 126 పోస్టులు, ఒంగోలు(Ongole) జోన్‌లో 142 పోస్టులు, కర్నూలు(Kurnool) జోన్‌లో 216 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వీటితో పాటు  అంగన్‌వాడీలకు సంబంధించి మరో కీలక నిర్ణయం(Key Decision) తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ ఫోన్లు(Smart Phones) అందించాలని నిర్ణయించింది ప్రభత్వం. ఇక రాష్ట్రంలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం ఈ మొబైల్స్(Mobiles) ఇస్తారు.

55,607 అంగన్‌వాడీ వర్కర్లు, 1,377 సూపర్‌వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్‌ ఫోన్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్‌ ఖరీదు రూ.14,998 కాగా.. మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లకు గ్రేడ్‌–1 సూపర్‌వైజర్లుగాను, గ్రేడ్‌–1 సూపర్‌వైజర్లకు సీడీపీఓ(CDPO)లుగాను, సీడీపీఓలకు ఏపీఓలు(APO)గాను ప్రమోషన్స్(Promotions) కల్పించామంటున్నారు.

ఇప్పుడు అంగన్‌వాడీ వర్కర్లకు గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లుగా పదోన్నతులు ఇస్తున్నామన్నారు.

అంగన్‌వాడీ వర్కర్ల  ప్రొమోషన్ల విషయంలో వయో పరిమితిని(Age Limit) 45 ఏళ్ల నుంచి 50(45 to 50 years) ఏళ్లకు ప్రభుత్వం పెంచింది(Increased).