డైరెక్టర్ మారుతి(Director Maruthi) దర్శకత్వం(Direction)లో గోపీచంద్(Gopichand), రాశీఖన్నా(Rashikhanna) జంట(Paired)గా నటించిన కొత్త మూవీ ‘పక్కా కమర్షియల్(Pakka Commercial)’.

ఈ మూవీ జులై 1వ తేదీన థియేటర్స్(Theaters) లో రిలీజ్(Release) కానుంది. జీఏ2 పిక్చర్స్,(GA2 Pictures), UV క్రియేష‌న్స్‌(UV Creations)‌ తో కలిసి బన్నీ వాసు(Bunny Vaasu) నిర్మించారు.

ఇప్పటికే ఈ విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో గోపీచంద్(Gopichand) సరికొత్త లుక్‌(New Look)లో కనిపిస్తున్నాడు. ‘అందాల రాశీ మేకప్‌ వేసి.. నాకోసం ఒచ్చావే..’ సాంగ్‌ (Song)ను మూవీ మేకర్స్(Movie Makers) రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్(Good Response) వస్తోంది.’పక్కా కమర్షియల్’ మూవీ ప్రమోషన్స్‌ (Movie Promotions)లో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్(Press Meet) నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ మారుతి నాకు స్టోరీ ఫస్టాఫ్ చెప్పి సెకెండ్ హాఫ్‌కు గ్యాప్ ఇద్దామని అనుకున్నాడు. కానీ నేను వెంటనే సెకెండ్ హాఫ్ కూడా చెప్పేయమని అడిగాను.

కథ వినగానే మారుతికి ఓకే చెప్పేశాను. మారుతి అక్కడి నుంచి వెళ్లిపోగా వంశీ(Vamsi) నా దగ్గరకు వచ్చాడు. నేను మొహటానికి ఈ సినిమా ఒప్పుకోలేదు. కథ చాలా బాగా నచ్చడంతోనే ఒప్పుకున్నాను అని చెప్పారు.

మారుతితో షూటింగ్(Shooting) చేస్తున్న టైంలో అతనితో వేవ్ లెంగ్త్(Wave Length) బాగా సెట్ అయింది.’రణం’, ‘లౌక్యం’ సినిమాల తరువాత కామెడీ(Comedy) చేసే స్కోప్(Scope) ఉన్న సినిమా ఇది.

ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. రాశీఖన్నా చాలా టాలెంటెడ్ హీరోయిన్(Talented Heroine). కానీ తనకు ఇంతవరకు సరైన క్యారెక్టర్లు పడలేదు. కానీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్(Good Character) దొరికింది. మారుతి మీద మొత్తం నమ్మకం పెట్టి ఈ మూవీ చేశా. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు.

ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. టైటిల్ తగినట్లు ఇది పక్కా కమర్షియల్(Pakka Commercial) మూవీ’ అని గోపీచంద్ తెలిపాడు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్(Allu Arvind), బన్నీవాసు(Bunny Vaasu), హీరోయిన్ రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.