స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,200 ఖాళీల ఉద్యోగ నియామకాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(JOB Notification) రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి. ఎస్బీఐ లో రెగులర్(Regular), బ్యాక్ లాగ్(Back Log) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ రిక్రూట్ మెంట్(Central recruitment) అండ్ ప్రమోషన్(Promotion) విభాగం కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యొక్క అధికారిక వెబ్‌సైట్(Official Website) sbi.co.inలో విడుదల(Release) చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1,226 సర్కిల్ ఆధారిత అధికారుల (CBO) ఖాళీలు ప్రకటించబడ్డాయి, దీని కోసం ఆసక్తిగల అభ్యర్థుల(Candidates) నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఉద్యోగానికి సంబంధించి విద్య అర్హతలు, ఖాళీలు, తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

విద్యార్హతలు:

  • ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(Graduation) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
  • డిసెంబర్ 1, 2021 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్), ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్(Scheduled Commercial Bank) లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యొక్క రెండవ షెడ్యూల్‌లో జాబితా చేయబడిన ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో అధికారిగా పని చేసి ఉండాలి.
  • నిర్దిష్ట రాష్ట్రానికి చెందిన ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా రాష్ట్రంలోని పేర్కొన్న స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం) కలిగి ఉండాలి.
  • ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని నిర్దిష్ట ఎంపిక చేసిన స్థానిక భాష పరిజ్ఞానం యొక్క పరీక్ష నిర్వహించబడుతుంది.
  • 10వ లేదా 12వ స్టాండర్డ్ మార్కు షీట్(Mark Sheet)/సర్టిఫికేట్(Certificate) సమర్పించే అభ్యర్థులు, దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని పేర్కొన్న స్థానిక భాషను సబ్జెక్ట్‌ లలో ఒకటిగా అధ్యయనం చేసినందుకు రుజువులను కలిగి ఉన్నవారు భాషా పరీక్ష(Language Exam)లో పాల్గొనవలసిన అవసరం లేదు.

ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టులు – 1,226 పోస్టులున్నాయి.
  • ఇందులో రెగులర్ పోస్టులు – 1100
  • బ్యాక్‌లాగ్ పోస్టులు – 126
  • అహ్మదాబాద్ (గుజరాతి): 354
  • బెంగళూరు (కన్నడ): 278
  • చెన్నై (తమిళం): 276
  • భోపాల్ (హిందీ): 214
  • జైపూర్ (హిందీ): 104
  • సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులు భర్తీ.

ముఖ్య సమాచారం:

వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి, అభ్యర్థి వయస్సు(Candidate Age) 21 ఏళ్లలోపు ఉండకూడదు మరియు 30 ఏళ్లకు మించకూడదు.

జీతం: ప్రాథమిక జీతం సుమారుగా రూ.36,000 మరియు ప్రతి సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్(Increment).

చివరి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 29, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ నియామకం: గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా:  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వివరాల కోసం ఎస్బీఐ(SBI) అధికారిక వెబ్‌సైట్(Official Website) https://bank.sbi/careers  ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు(Register) చేసుకోవాలి.