పాలు(Milk) లేని ఇల్లు కనిపించదు.మన రోజు పాలతోనే మొదలవుతుంది.ఎప్పటి నుంచి పాలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఈ రోజుల్లో నాణ్యమైన పాలు దొరకడం లేదు. ముఖ్యంగా ప్రొసెస్డ్ మిల్క్(Processed Milk) వచ్చాక స్వచ్ఛమైన అవ్వు(Cow), బర్రె(Buffalo) పాలు దొరకడం చాలా కష్టమవుతుంది. అయితే మన శరీరం పోషకాలు అందుకోవాలంటే  ఎలాంటి పాలు తాగాలి ఏ పాలల్లో పోషకాలు(Nutrients) ఉంటాయి. ఏ పాలను తాగడం వల్ల మనం ఆరోగ్యాం(Healthy)గా ఉంటాం. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పాలు(Milk) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే రోజు పిల్లల(Kids)కు పాలు తాగించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని పెద్ద వాళ్ళు చెబుతుంటారు. సాధారణంగా ఆవు పాలు లేదా గేదె పాలు తాగుతుంటాం. ఇవే కాకూండా మేక(Goat) పాలు, సొయా(Soya) పాలు, బాదాం (Badam) పాలు, కొబ్బరి(Coconut) పాలు, కాజు(Kaju) పాలు ఇలా ఎన్నో పాలు లభిస్తున్నాయి. ఏవ్ కాకుండా లాక్టోస్ ఫ్రీ పాలు (Lactose Free Milk) కూడా మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. ఆవు పాలు పిల్లలో త్వరగా జీర్ణం కావు. అందుకే గేదె పాలను తాగిస్తుంటారు. పాలల్లో పొటాషియం(Potassium), క్యాల్షియం(Calcium) తో పాటు విటమిన్ డి(Vitamin D) ఎక్కువ గా లభిస్తుంది.

క్రీం(Cream) తీసిన పాలను తాగించడం వలన శరీరం బరువు(Weight Loss) తాగించుకోవచ్చు. అయితే మాములు పాలు తాగేందుకు పిల్లలు ఇష్టపడరు.ఇలాంటి వారికీ చాక్లెట్ పాలు(Chocolate Milk) ఇవ్వాలి. దీని ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు(Proteins) అంది కండరాలు(Muscles) బలపడతాయి. పాలు పిల్లలకే కాదు అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆహారం(Complete Food). ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల శక్తి రావడంతో పాటు ఎముకుల వృద్ధి, పనితీరు బాగుంటుంది.

అయితే కొందరు పాలు తాగగానే గ్యాస్(Gas Problem) తో ఇబ్బంది పడటం కడుపు ఉబ్బరంగా అనిపించడం, డయేరియా(diarrhea) కు గురవుతుంటారు.ఇలాంటి వారి కోసం లాక్టోస్ ఫ్రీ మిల్క్(Lactose Free Milk) అందుబాటులోకి వచ్చింది.అవ్వు పాలలో మాదిరిగా ఇందులో పోషకాలు లభిస్తాయి.

ఇక మేక పాల విషయానికి వస్తే ఆవు పాలు మాదిరిగానే ప్రోటీన్ లు, క్యాల్షియం దొరుకుతుంది.

శాకాహార పాలైన సోయా(Soya)లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.వీటిని న్యూట్రిషన్ పవర్ హౌస్(Nutrition Power House) గా వర్ణిస్తారు. బాదాం పాలు కూడా తాగవచ్చు.వీటిలో కూడా మిగతా పాల మాదిరిగానే ప్రోటీన్లు, కాల్షియం లభిస్తాయి. మరో శాకాహార పాలు గా కాజు(Kaju) తో చేసిన పాలు గా చెప్పుకోవచ్చు. ఇవి కూడా బాదాం పాల మాదిరిగానే పోషకాలను అందిస్తాయి.

డైరీ పాల(Dairy Milk)కన్న దీనిలో ఎక్కువ క్యాల్షియం లభిస్తుంది. ఇక రైస్ మిల్క్(Rice Milk) విషయానికి వస్తే బ్రౌన్ రైస్(Brown rice) తో మాత్రమే పాలు తీసి తాగడం శ్రేయస్కరం. వీటిని ముల్టీపుల్ ఫుడ్ అల్లర్జీస్(Multiple Food Allergies) బాధపడే వారు తీసుకోవడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయి. కొబ్బరి ద్వారా తీసే పాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.కప్పు కొబ్బరి పాల(Coconut Milk)ల్లో రోజుకు అందాల్సిన కాల్షియం(Calcium) పొందవచ్చు.   అలాగే అవిసెగింజల(Flak Seeds) నుంచి కూడా పాలు తీస్తారు. దీని లో గుండె(Heart) ఆరోగ్యానికి పనికి వచ్చే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు(Omega Three Fatty Acids) అధికంగా లభిస్తాయి.

డైరీ పాలు(Dairy Milk)  అందుబాటులో ఉంటే వాటికే ప్రాధాన్యత(Importance) ఇవ్వాలి.ఒకవేళ డైరీ పాలు స్వచ్చమైనవి దొరకనప్పుడు, మార్కెట్ పై ఆధారపడకుండా మన ఇంట్లో అందుబాటిలో వుండే  బాదాం(Badam), కాజు(Kaju) బ్రౌన్ రైస్(Brown Rice), కొబ్బరి(Coconut), అవిసెగింజల(Flak Seeds) నుంచి పాలు(Milk) సేకరించి ఆహార తయారీలో వాడుకోవడం ఉత్తమం. మార్కెట్ లో దొరికే వాటిలో కృతిమ చత్రీలు ఎక్కువగా వుంది మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినా అవకాశాలు వుంటాయని గుర్తుంచాలి గుర్తుంచుకోవాలి.

ఆవు, గేదె పాలతో పోల్చితే  అన్ని వేగన్ పాల(Vegan Milk)ల్లో కాలరీలు(Calories) తక్కువ గా ఉంటాయి.

ఏది ఏమి అయినా మీ నిత్య జీవితం లో పాలని భాగంగా చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యం గా ఉండండి….