రాష్ట్రం లో ఉన్ననాలుగు ట్రిపుల్ ఐటీ (IIIT) ల ప్రవేశాలకు ఆర్జీయూకేటీ (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి , అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ (Online)  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26 న ప్రవేశ పరీక్షా ఉంటుంది. ఆగష్టు 20 ఉదయం 1౦ గంటల నుండి దరఖాస్తు (Application) స్వీకరణ మొదలవగా , సెప్టెంబర్ 6 న సాయంత్రం 5 గంటల కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగియనున్నది.

 Application

ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఉంటుంది. ఫిజకల్ సైన్సెస్ (Physical science) విభాగానికి 40 మార్కులు, మ్యాథమెటిక్స్ (mathematics)విభాగానికి 40 మార్కులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. రూ.1000 ఆలస్య రుసముతో సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . పరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబర్ 26న విడుదల కానుంది.
సెప్టెంబర్ 30 వరకు కీ (Key) పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది కీని అక్టోబర్ 2న విడుదల చేస్తారు.

టెన్త్ పరీక్ష (10th exams) ల్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం తెలిసిందే.
దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

score
ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ (counseling) నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.4౦౦, బీసీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పూర్తి వివరాల కోసం ఆర్జీయూకేటీ అఫిషియల్ వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను చూడవచ్చు. అంతే కాకుండా ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ ను వెబ్సైటు లో పొందుపరిచారు.