బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) లో ఆరో వారం హౌస్ మేట్స్(House mates) కొత్త ఉత్సహంతో కనిపించారు. టాస్క్ లో పోటీ పడి ఆడే కంటెస్టెంట్స్ వారి తీరును మార్చి కాస్త ఫన్ గా టాస్క్ లు ఆడారు.

అలాగే ఈ వారం కంటెస్టెంట్స్ ఒక్కఒక్కరూ ఒక్కో ధోరణితో ప్రవర్తించారు. సన్నీ హౌస్ మేట్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. సిరి ని మాత్రం అందరు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. విశ్వ రెండో సారి కెప్టెన్ అయ్యాడు.

మరి శుక్రవారం నాడు 41వ ఎపిసోడ్ హైలైట్స్ లోకి వెళదాం.

వరస్ట్ పెరఫార్మెర్ గా అందరు కలసి తనని టార్గెట్  చేస్తారేమో అని కంగారు పడ్డ సన్నీ. కానీ కాజల్ మానస్ ఆలా జరిగితే ఈసారి హౌస్ మేట్స్(House mates) తో గొడవకు దిగుతాం అని సన్నీ తో చెప్తారు.

ఇక ప్రియా, రవి, శ్రీరామ్ కాజల్ గురించి ముచ్చట్లు పెడతారు. కాజల్ అందరిని ప్రొవొకె చేస్తుందని.మనలని ఒక ప్రశ్న అడుగుతుంది అదే చెప్పేలోపే తానే ఏదోకటి అనేసుకుంటుందని చెప్పుకొచ్చారు.

ప్రియాంక రెండు సార్లు మైక్ వేసుకోవడం మరిచిపోవడం తో పింకీ ని మానస్‌తో లైట్స్ ఆఫ్ అయ్యే వరకూ మాట్లాడకూడదని, కావాలంటే  సైగలు మాత్రమే చెయ్యాలి అని కెఫ్టెన్ విశ్వ పనిష్మెంట్ ఇచ్చాడు. ‘

ప్లీజ్ అన్నయ్యా నా వీక్ నెస్ మీద కొట్టొద్దు నా వల్ల కాదు’ అంటూ ప్రియాంక రిక్వెస్ట్ చేసిన వినిపించుకోలేదు విశ్వ.

ఇక చేసేది ఏమిలేక ప్రియాంక అయిష్టంగానే మానస్ తో సైగల ద్వారా మాట్లాడింది.

తరువాత కిచెన్ లో శ్వేత కుక్కర్‌లో రైస్ ఉడుకుతుంటే,అది తీసి పక్కన పెట్టి హాట్ వాటర్  పెట్టుకుని, కుక్కర్ ఆన్ చెయ్యకుండా మరిచిపోయి వెళ్లిపోవడంతో గొడవ మొదలైంది.

అది గమనించిన ప్రియా ‘నువ్వు కుక్కర్ మళ్లీ పెట్టాలి కదా శ్వేతా సగంలో ఆగిపోతే రైస్ బాగుంటుందా చెప్పు?’అని అంటుంది. ‘నేను అది చూడలేదు ప్రియా గారు’ అని శ్వేత అనగానే చూడాలి అని చెబుతున్నాను.

అది బాధ్యత కదా నేను చూడకపోతే అలాగే ఉండిపోయేది’ అంటూ ప్రియా లోపలికి వెళ్లగానే.. ‘ఐ విల్ ఐ విల్’ అంటూ సద్దిచెప్పిన శ్వేత..

ప్రియ లోనికి వెళ్లగానే పక్కనే ఉన్న ఆనీ మాస్టర్‌తో ‘అసలు ఇప్పుడు ఎంత అయ్యింది టైమ్. ఈ టైమ్‌లో లంచ్ పెట్టేస్తారని నేను అనుకుంటానా? అన్నింటికీ రియాక్ట్ అయితే నేను కూడా రియాక్ట్ అవుతాను. అంత అవసరం లేదు. ఆ టోన్ అవసరం లేదు’ అని విసుకుంటుంది.

విశ్వ వచ్చి మరోసారి శ్వేతతో అదే విషయం మాట్లాడటంతో ‘ఇది లంచ్ టైమా?’ అని అంటుంది.‘ప్రియాగారు అక్కడ రైస్ పెట్టారనే సంగతి నాకు తెలియదు’ అనగానే ప్రియా తెలియదు కాబటి చూసుకోవాలి కదా అన్నాను.

అంతే, కావాలని ఎవరూ చెయ్యరు కదా’ అంటుంది ప్రియ. ‘తెలిస్తే నేను ఎందుకు చేస్తాను రైస్ మన కోసమే కదా అంటుంది శ్వేత. ‘అయ్యో శ్వేతా నువ్వు తెలిసి చేశావ్ అనట్లేదు, మరోసారి ఇలా జరగకుండా చూసుకో అంటున్నాను అంతే’ అని ప్రియ చెబుతుంటే ‘అది నాకు తెలుసు కానీ మీ టోన్ నాకు నచ్చలేదు’ అని అంటుంది శ్వేతా.

తరువాత ల‌గ్జ‌రీ బ‌డ్జెట్(Luxury Budget) టాస్క్ గా ‘ప‌గ‌ల‌గొట్టిన‌వారిదే పండ‌గ’  అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్(Big Boss).

ఈ టాస్కు(Task) లో భాగంగా ప‌లు గేమ్స్ ఆడించాడు. అయితే ష‌ణ్ముఖ్‌ ఆట మొద‌ల‌వ‌క‌ముందే డ్రాప్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చాడు. కానీ త‌ర్వాత మాత్రం ఆట ఆడ‌క త‌ప్ప‌లేదు.

యాపిల్స్‌తో ట‌వ‌ర్ కట్టే టాస్కులో శ్వేత గెలిచింది. ఆమె ప‌గ‌ల‌గొట్టిన కుండ‌లో మ‌ట‌న్ వ‌చ్చింది. మార్బల్స్ ను స్కేలుకు ఒక‌వైపు నుంచి మ‌రోవైపుకు చేర్చే గేమ్‌లో కాజ‌ల్ ప్రియ‌పై గెలిచింది.

ఆమె ప‌గ‌ల‌గొట్టిన పిగ్గీ బ్యాంక్‌లో ర‌వ్వ అనే ఐట‌మ్‌ ఉంది. చాప్‌స్టిక్స్‌తో బాల్స్ గీత‌కు అవ‌త‌ల వేయాల‌న్న గేమ్‌లో లోబో, యానీ పాల్గొన‌గా.. లోబో గెలిచి పిగ్గీ బ్యాంకు ను  ప‌గ‌ల‌గొట్టగా అందులో ప‌న్నీర్ వుంది.

స్ట్రాతో కాండీస్  ప్లేటులో వేయాల్సిన గేమ్‌లో ర‌వి గెల‌వ‌గా అత‌డు ప‌గ‌ల‌గొట్టిన కుండ‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న‌ట్లు తేలింది. ముక్కుతో దూది తీయాల్సిన గేమ్‌లో ష‌ణ్నును ఓడించి విశ్వ గెలిచాడు. అత‌డు ప‌గ‌ల‌గొట్టిన పిగ్గీబ్యాంక్‌లో కాఫీ వ‌చ్చింది.

షన్ను సిరి హర్ట్ అయ్యేలా తిట్టడంతో, నాకు క్యారెక్ట‌ర్ లేదుక‌దా, మ‌రెందుకు ఫ్రెండ్‌షిప్ చేయ‌డం? చేయ‌కండి అని అలుగుతుంది  సిరి. నిన్ను ఏడిపిద్దామని  అలా అన్నాడు,  ఆమెను బుజ్జగించే  ప్రయత్నం  చేశాడు జెస్సీ.

నా బ్రెయిన్‌ను డిస్ట‌ర్బ్ చేద్దాం అనుకుంటున్నారా? అని హ‌ర్ట్ అయింది సిరి. వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడితే బాధ‌గా ఉంటుంద‌ని చెప్పింది.

ఇంత‌లో ప్రియాంక వ‌చ్చి నాకు ప్రొపోజ్ చేయాల్సివ‌స్తే ఎలా చేస్తావు? అని జెస్సీని అడిగింది. అత‌డు నిర్మొహ‌మాటంగా నేను చెయ్యను అని తేల్చి చెప్పాడు. ఒక‌వేళ చెయ్యాల్సి వ‌స్తే స‌చ్చిపోతాడు, కానీ చెయ్య‌డు అని కౌంట‌రిచ్చాడు ష‌ణ్ను.

దీంతో రూటు మార్చిన పింకీ త‌న‌ను సిరి అనుకుని ప్రొపోజ్ చేయ‌మంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న ష‌ణ్ను ఆమె నీకు ఏ యాంగిల్‌లో న‌చ్చిందిరా అంటూ సెట్టైర్ వెయ్యడం తో సిరి ఏడ్చేసింది. తరువాత ఈ వారం  బెస్ట్, వరస్ట్ పెరఫార్మెర్ గా ఎంపిక చేయమని ఆదేశించిన బిగ్ బాస్(Big boss). దీంతో ఎక్కువ మంది వరస్ట్ పెరఫార్మెర్(Worst performer) గా శ్వేతాని ఎంపిక చేయడంతో జైలుకు వెళ్లిన శ్వేతా.

ర‌విని క్షమించ లేక‌పోతున్నాన‌ని మాన‌స్‌తో చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. ఫేస్ చూసి మోస‌పోక‌ని, సింప‌తీగా ఫేస్ పెడితే నమ్మద్దు అని గట్టిగా  చెప్పాడు మాన‌స్‌.

మ‌రోప‌క్క‌ ర‌వి వల్ల తాను టార్గెట్ అయ్యానని  జైలులో ఏడ్చేసింది శ్వేత‌. దీంతో యానీ మాస్టర్  ఆమెను ఓదార్చింది. త‌ర్వాత‌ ష‌ణ్ముఖ్ శ్వేత‌తో ఆమె జైలుకు వెళ్లిన కారణాల గురించి డిస్కస్ చేస్తాడు.

ర‌వి మీతో చేయించాడు కానీ అత‌డు చేయ‌లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశాడు. త‌ర్వాత శ్వేత‌కు, యానీ మాస్టర్ కు జ‌రిగిన గొడ‌వ గురించి ప్రస్తావిస్తూ అందులో యానీ త‌ప్పే ఉంద‌న్నాడు.

త‌న‌కు ఏ రిలేష‌న్స్ వ‌ద్దంటూ ఆమె నోరు జారింద‌ని చెప్పడంతో శ్వేత కళ్ళలో నీళ్లు తిరిగాయి.

దీంతో ఎమోషనల్(Emotional) అయిన శ్వేతా విష్ మై మామ్ షుడ్ అలైవ్  అని అంటూ  వెక్కి వెక్కి ఏడ్చింది.