తెలుగు(Telugu) మాసాలలో విశిష్టమైనది కార్తీక(Karthika) మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమ శివుని(Lord Shiva)కి ప్రీతిపాత్రమైనది ఇది. ఆధ్యాత్మిక(Spiritual)పరంగా ఆరోగ్యప్రదమైన మాసం.ఈ మాసంలో సోమవారం(Monday)నాడు ఉపవాసం(Fasting) చేసి రాత్రి నక్షత్ర దర్శనం(Nakshatra Darshanam) చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధు గ్రంధం తెలుపుతుంది.

ఈ మాసంలో ప్రతి రోజు పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత బలప్రదమైనవి, అవి భగినీ(Bhagini), హస్త భోజనం(Hastha Bhojanam), నాగులచవితి(Nagula Chavithi), నాగ పంచమి(Naga Panchami), ప్రభోధిని ఏకాదశి(Prabhodini Ekadasi), క్షీరాబ్ధి ద్వాదశి(Ksheerabdhi  Dwadasi), కార్తీక పౌర్ణమి(Karthika Pournami) మొదలైనవి. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభవుతుంది. ఈ ,మాసంలో భక్తులంతా బోలా శంకరుడి నామాన్ని స్మరిస్తూ వుంటారు. పురాణం కాలం నుంచి ఈ మాసం యొక్క  ప్రత్యేకత(Speciality)ను సంచరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తి కోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యముంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు(Women) పూజలు(perform Puja) చేస్తుంటారు.

హరిహరుదలకు ప్రీతీకరం కార్తీకమాసం, మన భారతీయ సంస్కృతి(Indian Culture)లో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోను కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాల ముఖ్యమైనది దేశం నలుమూలలా వున్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ,లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమ అర్చనలు(Archanas) విశేషంగా జరుగుతుంటాయి. అలా విశేషణారచన జరిపే  భక్తులకు సదాశివుడు ప్రసన్నుడయ్యి కొంగు బంగారంలా సాదృశ్యం కల్పిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అని బిరుదు వచ్చింది. ఉపవాసం, స్నానం, దానం, మాములుగా చేసేటప్పటికంటే ఎన్నో రేట్లు ఫలాన్నిస్తాయి.

విష్ణువుని తులసీదళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపూవు, గరిక, దర్భలతోను,శివుని బిల్వదళాలతోను, జిల్లేడు పూలతోను అర్చించేవారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు పాలు(Milk),పండ్లు(Fruits) తీసుకోవచ్చు. నారాయన్స్వర వ్రతం, కేదారేశ్వర వ్రతం, కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలూ(Vrathalu) ఇవి చేస్తే మంచిది.

ఈ మాసం లో చేసే స్నాన, ధ్యాన(Dhyana), జపాల(Japas) వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే ఆలా రోజు చేయలేనివాళ్లు కనీసం ఏకాదశి, పూర్ణిమ,ద్వాదశి, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, ఒక సోమవారం రోజైన నియమ నిష్టలతో ఉపవాసం వుంది గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కదాని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసం ఉండి. రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సప్తపాపాలు భష్మిపాటలమై ఇహ లోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక గాధలు ఇతివృత్తాలు ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు.

తామానం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికిపోరాదు. ఎవరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయరాదు. దైవ దూషణ తగదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.

కార్తీక వ్రతం పాటించేవారు. ఆ వ్రతం చేయని వారి వంట తినరాదు. కార్తీకమాసంలో  చేసే దీపారాధన వలన గతజన్మ పాపలతో సహా ఈ జన్మ పాపలు కూడా తొలిగిపోతుంది. స్త్రీ ఈ మాసం దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్దిస్తాయి.  మనలోని అజ్ఞానం(Ignorance) అనే చీకటిని తొలిగించుకుని, జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన(Deeparadhna) ఉద్దేశం(Intention).