మాస్ మహారాజ రవితేజ(Ravi teja), డైరెక్టర్ సుధీర్‌ వర్మ కంబినేషన్లో  తరూపొందుతున్న మూవీ  ‘రావణాసుర’.

ఈ చిత్రంలో  అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ (shooting) పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం.

హీరో రవితేజ ఈ సినిమాలో  లాయర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ, సుశాంత్‌ ఫస్ట్‌ లుక్స్‌ (First looks)కి ఆడియన్స్ నుంచి  మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌ కథతో పాటు మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

ఈ చిత్రానికి సంగీతం(Music): హర్షవర్ధన్‌ రామేశ్వర్, భీమ్స్,కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్, సీఈఓ: పోతిని వాసు వ్యవహరించారు.