బిగ్ బాస్  సీజన్ 5(Big Boss Season 5) ఫ్యామిలీ ఎపిసోడ్ లో వాళ్ళ కుటుంభం సభ్యులు రాకతో హౌస్ మేట్స్(House mates) తెగ సంతోష పడిపోతున్నారు.

ఇప్పటికే కాజల్,శ్రీరామ్, మానస్, సిరి వాళ్ళ ఫ్యామిలీస్ బిగ్ బాస్(Big Boss) హౌస్ లో సందడి చేయగా, గురువారం సన్నీ వాళ్ళ అమ్మగారు ఇంట్లో కి ఎంట్రీ ఇచ్చారు .

ఇక శుక్రవారం ఎపిసోడ్ సన్నీ వాళ్ళ అమ్మగారి రాకతో ప్రారంభమైంది. కళావతి గారు బిగ్ బాస్ హౌస్ ని  చూసి సంబరపడిపోయారు. కాజల్ ని చూపిస్తూ బిగ్ బాస్ నీకు చెల్లెలిని ఇచ్చింది అని చెప్తుంది.

దీనితో ఆ మాటలకి కాజల్ గెంతుతూ ఆనందంలో మునిగితేలింది. అయితే సన్నీ మాత్రం ఆమె నాకు చెల్లి ఏంటి? భూమి పుట్టినప్పుడు పుట్టింది అని పంచ్ వేసాడు. హౌస్ లోకి అడుగు పెట్టిన తన తల్లి కి గోరు ముద్దలు తినిపించాడు.

తల్లి చేతులు మీదగా ఏవిక్షన్ ఫ్రీ పాస్ అందుకోవడంతో సన్నీ చాలా హాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తరువాత సన్నీ వాళ్ళ అమ్మ బర్త్ డేను  హౌస్ మేట్స్ మధ్య సెలెబ్రేట్(Celebrate) చేసారు.

ఈ సందర్భంగా సన్నీ వాళ్ళ అమ్మతో నేను బిగ్ బాస్ టైటిల్ విన్నర్(Tittle Winner) గా గెలుస్తానని మాటిచ్చాడు.

ఆ తరువాత మానస్,కాజల్ మధ్య పింకీ గురించి డిస్కషన్ జరుగుతుంది.  సన్నీ దగ్గర ఏవిక్షన్ ఫ్రీ(Free Eviction) పాస్ ఉండడంతో పింకీ సన్నీ తో క్లోజ్(Close) గా ఉంటోందని అభిప్రాయపడ్డాడు మానస్.

పింకీ తాను తన ఎస్ బాయ్ ఫ్రెండ్ స్థానంలో నన్ను రీప్లేస్ చేద్దామానుకుంటోందని. అది జరగదని, నేను అలాంటివాడిని కానని పింకీ తో చెప్పానని. మనం ఎప్పటికి ఫ్రెండ్స్(Friends) లా ఉందామని క్లారిటీ గా చెప్పానని, కాజల్ తో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాడు. అలాగే పింకీ బాగా అబద్ధాలు చెప్తోందని. అది మానస్ కి నచ్చలేదని చెప్పుకొచ్చాడు.

ఇక మరో పక్క షన్ను బిగ్ బాస్(Big Boss) హౌస్ ఎలా వున్నన్ని రోజులుఉండాలని కుటుంబ సభ్యలను బాధపెట్టడం వద్దని తనకు తానూ నచ్చచెప్పుకున్నాడు.  తండ్రి లేని అమ్మాయివని నీకు దగ్గర అవ్వడం లేదని ఈ మాట మీ అమ్మకు చెప్పు అని సిరికి  చెప్పాడు.

ఆ తరువాత పింకీ వాళ్ళ సిస్టర్ మధు హౌస్ లోకి అడుగు పెట్టింది. దీనితో సోదరిని చూడగానే ఎమోషనల్(Emotional) అయినా పింకీ నాన్న ఎందుకు రాలేదని  అడిగింది. నాన్నకు  ఇంకా ఐ ప్రాబ్లెమ్ ఉందని చెపింది. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్‌(Game) మీద మాత్రమే ఫోకస్‌(Focus) చేయ్‌.అని సూచించింది.

తర్వాత రవి భార్య నిత్య ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసిన రవి కొంత సంతోషిస్తూనే మరికొంత బాధకు లోనయ్యాడు. కూతురు వియా రాలేదేంటని ఫీల్(Feel) అయ్యాడు. ఇంతలో వియా హౌస్‌లోకి సర్‌ప్రైజ్‌(Surprise) ఎంట్రీ ఇవ్వడంతో అతడి సంతోషం  కట్టలు తెంచుకుంది. సుమారు 80 రోజుల తర్వాత కూతురు స్పర్శ తగిలినందుకు ఎమోషనల్‌ అయ్యాడు.

నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుందని రవికి చెప్పుకొచ్చింది చేసింది వియా. తర్వాత బిగ్‌బాస్‌(Big Boss) అంకుల్‌ ఎక్కడ? అంటూ అతడికోసం ఇల్లంతా వెతికి హంగామా చేసింది. రవి తన భార్యకు షణ్నును పరిచయం చేస్తూ వీడు నాతో ఎలా ఉంటాడో తెలీదు కానీ, వీడు మాత్రం లైఫ్‌లాంగ్‌ తమ్ముడని చెప్పాడు.

అతడితో నిత్య మాట్లాడుతూ రవి ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తాడంటారు, కానీ రవి అంత సీన్‌ లేదని తెలిపింది. చాలా రోజుల తర్వాత కూతురుని చూడడంతో  ఆమెతో సరదాగా ఆడుకున్నాడు రవి. వీళ్ల కోసం బిగ్‌బాస్‌ గుమ్మాడి గుమ్మాడి పాట(Song) వేయడంతో  తండ్రీకూతుళ్లు డ్యాన్స్‌ చేశారు. తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌ను వదిలి వెళ్లాల్సిన టైం రావడంతో వియా తండ్రిని వదిలి పెట్టి వెళ్లలేక గుక్కపెట్టి ఏడ్చింది.

చివరగా  షణ్ను తల్లి బిగ్ బాస్(Big Boss) హౌస్ లో రావడంతో  ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. తన ప్రేయసి దీప్తి సునయన ఎలాగుంది అని అడిగి తెలుసుకున్నాడు. సిరి వాళ్ల మమ్మీ కి కొన్ని నచ్చట్లేదని బాధపడ్డారు అంటూ హగ్గుల గురించి మాట్లాడినదాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అవేమీ పట్టించుకోని షణ్ను వాళ్ళ అమ్మ  దేని గురించి ఆలోచించకు, ఫ్రెండ్‌షిప్‌(Friendship) కదా అంటూ కొడుక్కు సపోర్ట్‌(Support) చేసింది.

ఎక్కువ ఎమోషనల్‌ అయి ఆట పాడు చేసుకోకని అడ్వైజ్ చేసింది . అందరితో కలిసి ఉండమని షణ్నుకు గట్టిగా  చెప్పింది. అతని ఆటలా చూడండి, ఎక్కువ ఎమోషనల్‌(Emotional) అవద్దని షణ్ను, సిరిలకు సూచింది.

మొత్తానికి ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా పూర్తయింది. హౌస్ లోకి కంటెస్టెంట్స్(Contestants) యొక్క కుటుంభం సభ్యులు  రాకతో  మిగిలిన ఆటను హౌస్ మేట్స్(House mates) మరింత స్ట్రాంగ్(Strong)గా ఆడుతారని ఆశిద్దాం.

ఇక  శనివారం వీకెండ్ షో ప్రారంభం కానుంది. నాగ్ సర్ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్(Family Episode) గురించి ఎం చెప్పనున్నారో. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్(Eliminate) కానున్నారో…..