బిగ్ బాస్ సీజన్ 5 (Big Boss Season 5) ఈ వారం  హౌస్ మేట్స్(House mates) వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ ఆనంద నిలయంగా మారింది. కంటెస్టెంట్స్(Contestants) ఎవరి ఫ్యామిలీ మెంబెర్స్(Family Members) వచ్చిన అందరు తెగ సంబరపడిపోతున్నారు.

తరువాత మా వాళ్ళ ఎప్పుడు వస్తారా? అని ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాజల్ కుటుంబ సభ్యలు ఇంట్లో సందడి చేయగా, ఆమె చాలా ఆనంద పడింది.

ఇక గురువారం నాటి  ఎపిసోడ్(Episode) లో భాగంగా శ్రీరామ చంద్ర , మానస్ , సిరి ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారు కుటుంబ సభ్యులతో కలసి హౌస్ మేట్స్ చేసిన గోల ఏంటో ఇక్కడ చూద్దాం.

గురువారం ఎపిసోడ్ లో శ్రీరామ్‌  సోదరి అశ్విని హౌస్‌(House)లోకి వచ్చింది. అందరితో కాసేపు మాట్లాడడం అయిపోయాక శ్రీరామ్‌కు ఆట గురించి అడ్వైజ్(Advice) ఇచ్చింది. నీ పాయింట్‌ నువ్వు చెప్పు, కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినమని చెప్పింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ తెలిపింది.

ఆ తరువాత అందరికి బాయ్ చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తర్వాత మానస్‌ తల్లి పద్మిని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే హౌస్‌ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది. తరువాత హౌస్‌లోకి మానస్ తల్లి పద్మిని వచ్చారు.

ఫుల్ ఎనర్జీ(Energy)తో హౌస్‌లో తెగ సందడి చేశారు.చాలా కూల్ గా మానస్ ఉంటే, అతని అమ్మగారు చాల ఆక్టివ్ గా వున్నారు. హౌస్ మేట్స్ అందరి పై జోక్ వేసి అందరిని ఫుల్ జోష్ లో ఉంచారు.

ప్రియాంక మానస్ గేమ్‌(Game)ని డిస్ట్రబ్ చేస్తుందన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌ గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని.

నా కొడుక్కి పెళ్లిళ్లు చేస్తావా? ఏంగేజ్ మెంట్‌లు చేస్తావా? అని రవిపై సెటైర్లు(Settaire) వేసింది మానస్ తల్లి పద్మిని. ఆ డైలాగ్‌తో ప్రియాంక నోరెళ్లబెట్టింది.

పెళ్లిళ్ల పేరయ్య నువ్వే  (షణ్ముఖ్) కదా, నువ్ ఎట్టా అయ్యావ్ అంటూ నువ్వు, నాకు హగ్ ఇయ్యి నేను వెళ్లి ఆ హగ్‌(Hug)ని దీప్తికి  ఇచ్చేస్తా అని సెట్టైర్ వేసింది మానస్ వాళ్ళ అమ్మ . ఇక శ్రీరామ్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. అని అంటే ఆంటీ అంటావ్ ఏంటి? అక్క అని అనండి అంటూ ఫుల్ స్వింగ్‌లో కనిపించారు మానస్ తల్లి.

ఆ తరువాత శ్రీరామ్ ఆంటీ  మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారని పంచ్ వేశాడు. ఆ తరువాత మానస్‌కి నాకు మీలాంటి అమ్మాయిని చూడండి ఆంటీ పెళ్లి చేసుకుంటామ్ అని శ్రీరామ్ అనగా. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తాలే అని అంటూ అవునూ. నీకోసం బయట హమీదా వెయిటింగ్ ఏమో అని అదిరిపోయే కౌంటర్  వేసింది పద్మిని.

మొత్తానికి హౌస్‌లో ఉన్నంతసేపూ పద్మిని సందడి చేసారు . ఫుల్ ఎనర్జీతో అందర్నీ ఆటాడించారు. ఇక మానస్‌తో మాట్లాడుతూ గేమ్ చాలా బాగా ఆడుతున్నావని.. ప్రతి పేరెంట్స్ నిన్ను విన్నర్‌(Winner)గా చూడాలని కోరుకుంటున్నారు.

వాళ్ల ఆశని నువ్వు  నిజం చేయాలంటే ఎవరు డిస్ట్రబ్ చేసినా డిస్ట్రబ్ కాకు అని ఇన్ డైరెక్ట్‌(Indirect) గా ప్రియాంక విషయాన్ని ప్రస్తావించారు పద్మిని. మొత్తంగా హౌస్‌లో ఉన్నంత సేపు మానస్ తల్లి ఫుల్ ఎనర్జీతో కనిపించారు. మానస్ క్లాస్ అయితే ఆమె తల్లి ఊర మాస్ అన్నట్టుగా కనిపించరు.

బీబీ ఎక్స్‌ప్రెస్‌ టాస్క్‌ లో భాగంగా షణ్ను పాజ్‌(Phause)లో ఉన్నప్పుడు హౌస్‌మేట్స్‌ అతడికి  ప్రేగ్నన్ట్ లేడీ గా  వేషం వేశారు , ఇక  సిరికి మీసాలు గీసి ఆటపట్టించారు.  ఎప్పుడు ఇదొక గొడవలతో ఊగిపోయే హౌస్ మేట్స్ ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ లో అందరు సరదాగా కలిసిపోయి ఉండడం చూస్తే ప్రేక్షకులను ఆకట్టుకుందనే  చెప్పాలి.

ఆ తరువాత  సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేయడం బాగుంది  కానీ, ఆలా హగ్గులు చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దాంతో  సిరి టాపిక్‌ డైవర్ట్‌(Divert) చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది.

హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా ఫీలవుతారు అని మండిపడింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి చెప్పింది.

నువ్వెలాగో టాప్‌ 5(Top 5)లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు పట్టుకునే రావాలి అని సిరికి మరీమరీ చెప్పింది ఆమె తల్లి. తర్వాత తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది. సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు.

ఆమెకు తల్లినయినందుకు సంతోషం(Happy)గా  ఫీలవుతున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్‌ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను ముందులాగా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా ఆట  కూడా వదిలేసి ఇంత సపోర్ట్‌(Support) చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని బాధపడ్డాడు.

అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఫీలయ్యాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోతూ ఏడ్చేశాడు.

మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌(Friend)గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ హోప్స్(Hopes) పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ట్రై చేసాడు.

మానస్‌ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. తరువాత  సన్నీ తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌(House mates) తో సెలబ్రేట్‌(Celebrate) చేసుకోనుంది.

ఆ సెలబ్రేషన్స్‌ రేపటి ఎపిసోడ్‌(Episode)లో టెలికాస్ట్ అవ్వనుంది..