పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్(Good News). ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ (Release) చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని(188 Posts) భర్తీ చేస్తోంది. పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్(Sorting Assistant), పోస్ట్‌ మ్యాన్(Post Man), మెయిల్ గార్డ్(Mail Guard), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi tasking Staff) లాంటి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు(Post Office Jobs) ఉన్నాయి. ఇవి స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో భర్తీ చేస్తున్న పోస్టులు.

టెన్త్(Tenth), ఇంటర్(Inter) పాస్ కావడంతో పాటు ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు(Sports Person) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు(Apply) చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2022 నవంబర్ 22 ఆఖరి తేదీ(Last date). ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు(Full Details), విద్యార్హతలు(Educational Qualification), దరఖాస్తు విధానం(Application process) గురించి కింద పొందుపరిచి వుంది.

పూర్తి సమాచారం:

మొత్తం ఖాళీలు    188

పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్  71

పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్  56

మల్టీ టాస్కింగ్ స్టాఫ్          61

దరఖాస్తు ప్రారంభం: 2022 అక్టోబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 నవంబర్ 22 సాయంత్రం 6 గంటలు

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్: 2022 నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు

ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ లిస్ట్ ప్రకటన: 2022 డిసెంబర్ 6

విద్యార్హతలు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. అక్టోబర్ 25, 2022 నాటికి ఈ విద్యార్హతలు ఉండాలి.

వయస్సు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల(Reserved Categories)కు వయస్సులో సడలింపు(Age Exemption) ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉండాలి. మెరిట్ ఆధారం(Merit Based)గా ఎంపిక చేస్తారు.

వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, పోస్ట్‌ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనం(Basic Salary)తో మొత్తం రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం 56,900 వేతనం లభిస్తుంది. అలవెన్సెస్(Allowances) కూడా ఉంటాయి.

దరఖాస్తు చేసుకోండి ఇలా

  • అభ్యర్థులు https://dopsportsrecruitment.in/ వెబ్‌సైట్(Website) ఓపెన్ చేయాలి.
  • మొదటి స్టేజ్‌లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్(Registration) చేయాలి.
  • రెండో స్టేజ్‌లో దరఖాస్తు ఫీజు(Fee) చెల్లించాలి. మహిళలు(Women), ట్రాన్స్‌ జెండర్ వుమెన్(Transgender Women), ఎస్‌సీ(SC), ఎస్‌టీ(ST) అభ్యర్థులకు ఫీజు లేదు.
  • మూడో స్టేజ్‌లో ఫోటో(Photo), సంతకం(Signature), మార్క్స్ మెమో(Marks Memo) లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్(Documents Upload) చేయాలి.