సమంత (Samantha) నటించిన ‘యశోద(Yasodha)’ ట్రైలర్(Trailer) ని విడుదల(Release) చేయడానికి మూవీ మేకర్స్(Movie Makers)  సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజయిన టీజర్‌(Teaser)లో ప్రగ్నెంట్ ఉమెన్‌(Pregnant Women)గా కనిపించిన సమంత థ్రిలింగ్(Thrilling) బ్యాక్‌డ్రాప్‌(Back Drop)లో సవాళ్లని ఎదురీదుతూ కనిపించింది. దాంతో ఇప్పటికే ఈ యశోద (Yashoda) సినిమాపై అంచనాలు(Expectations) పెరిగిపోగా, గురువారం ఐదుగురు స్టార్ హీరోలు యశోద ట్రైలర్ (Yashoda trailer)‌ని లాంచ్‌(Launch)‌ని చేయబోతున్నారు.

దాంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. నవంబరు 11(November 11)న థియేటర్ల(Theaters)లోకి  యశోద ప్రేక్షకుల(Audience)ను అలరించడానికి  వచ్చేస్తోంది. ది ఫ్యామిలీ మెన్(The Family Man) వెబ్‌ సిరీస్‌(Web Series)లో నటించిన సమంత దేశవ్యాప్తం(India)గా  మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌(Item Song)తో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది.

దాంతో యశోద మూవీని తెలుగు(Telugu), తమిళ(Tamil), కన్నడ(Kannada), మలయాళం(Malayalam), హిందీ(Hindi) భాషల్లో విడుదల  చేయబోతున్నారు. ఈ మూవీలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi SarathKumar), ఉన్ని ముకుందన్(Unni Mukundan) కీలక పాత్ర(Key Role)లో నటించారు. హరీ(Hari), హరీష(Harish) ఈ సినిమాకి దర్శకత్వం(Direction) వహించగా శివలెంక (Shiva Lenka) కృష్ణప్రసాద్(Krishna Prasad) ప్రొడ్యూసర్(Producer) గా వ్యవహరించారు. యశోద ట్రైలర్‌ని గురువారం (ఈ నెల 27) సాయంత్రం 5:36 గంటలకి రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగులో విజయ్ దేవరకొండ(Vijaya Devarakonda), తమిళంలో సూర్య(Surya), కన్నడలో రక్షిత్ శెట్టి(Rakshith Shetty), మలయాళంలో దుల్కర్ సల్మాన్(Duquer salman), హిందీలో వరుణ్ ధావన్(Varun dhawan) ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లు యశోద టీమ్ అనౌన్స్(Announce) చేసింది.