దసరా(Dasara), దీపావళి(Diwali) సీజన్ ముగియడంతో ఇంకా విడుదల కానీ సినిమాలన్నీ థియేటర్లలో అడుగుపేటేందుకు అంత సిద్ధం సిద్ధమవుతోంది. చాలా కాలం క్రితం షూటింగ్(Shooting) పూర్తి చేసుకున్నప్పటికీ థియేటర్లు దొరక్క వాయిదా(Postpone) పడుతున్న సినిమాలన్నీ ప్రేక్షకుల(Audience)ను అలరించడానికి థియేటర్ల(Theaters)లో విడుదల కానుంది. ఎప్పటిలాగే ఈ వారం థియేటర్ల,తో పాటు ఓటీటీ(OTT)లో సందడి చేయబోతున్న సినిమాలు సిరీస్ ల మీద ఒక లూకేద్దాం.

అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరో(Hero)గా రామసేతు(Rama sethu) అక్టోబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. రామసేతు రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.

మరోపక్క సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) హీరోగా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) హీరోయిన్గా నటించిన థాంక్ గాడ్(Thank god) సినిమా కూడా అక్టోబర్ 25వ తేదీన విడుదలైంది, ఈ సినిమాలో అజయ్ దేవగన్(Ajay Devagan) ఒక కీలక పాత్ర(Key role)లో నటించారు.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్ హీరోగా నటుడు నరసింహారావు ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం(Anukoni Prayanam) సినిమా అక్టోబర్ 28వ తేదీన విడుదలవుతోంది.

ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాలు తెరక్కేకించిన వెంకటేష్ పెద్దిరాల(Venkatesh Peddirala) ఈ సినిమా డైరెక్ట్(Direction) చేశారు. ఇక అదే రోజు అషు రెడ్డి(Ashu Reddy) హీరోయిన్గా సుహాసిని, భానుచందర్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఫోకస్(Focus). సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా అదే రోజు రిలీజవుతుంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్‌(Netflix) లో అక్టోబరు 25న హాలీవుడ్‌ మూవీ బ్లేడ్‌ ఆఫ్‌ ది 47 రోనిన్‌,  కేబినెట్‌ ఆఫ్‌ క్యూరియాసిటీస్‌ అనే వెబ్‌సిరీస్‌, రాబింగ్‌ ముస్సోలిని అనే ఇటాలియాన్‌ మూవీ స్ట్రీమ్ అవనున్నాయి.

అక్టోబరు 26న హాలీవుడ్‌ నుంచి ద గుడ్‌ నర్స్‌, దుబాయ్‌బ్లింగ్‌ రియాల్టీ షో(Reality show) అక్టోబరు 27న హాలీవుడ్‌(Hollywood) బియాండ్‌ ద యూనివర్స్‌, అక్టోబరు 28న మర్డర్‌ ఇన్‌ ది కోర్ట్‌ రూమ్‌ వెబ్‌సిరీస్‌(Webseries), ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ అనే హాలీవుడ్‌ మూవీ, ద బాస్టర్డ్‌ ఆన్‌ అండ్‌ ద డెవిల్‌ హిమ్‌ సెల్ఫ్‌ అనే వెబ్‌సిరీస్‌ స్ట్రీమ్ కానున్నాయి. అదే విధంగా అమెజాన్‌(Amazon) ప్రైమ్‌ వీడియో(Prime Video)లో అక్టోబరు 27న ధనుష్ హీరోగా వచ్చిన నేనే వస్తున్నా సినిమా, అక్టోబరు 28న ఫ్లేమ్స్‌ అనే హిందీ సిరీస్‌ స్ట్రీమ్ కానున్నాయి.

ఇక డిస్నీ ప్లస్‌(Disney plus) హాట్‌స్టార్‌(Hot Star) లో అక్టోబరు 26న టేల్స్‌ ఆఫ్ ది జేడి అనే వెబ్‌ సిరీస్‌, అక్టోబరు 27న ఝాన్సీ తెలుగు సిరీస్‌, అక్టోబరు 28న అప్పన్‌(Appan) మలయాళ సినిమా(Malayala Movie) స్ట్రీమ్(Stream) కానున్నాయి.