టాలీవుడ్(Tolly wood) రౌడీ స్టార్(Rowdy Star) క్రేజే(Craze) వేరని మరోసారి రుజువయ్యింది. లైగర్(Liger) డిజాస్టర్(Disaster) కావడంతో కొందరు పనిగట్టుకొని మరీ ట్రోల్స్(Trolls) చేశారు. అయితే అవేవీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) క్రేజ్‌ని అడ్డుకోలేవని తాజాగా బయటకొచ్చిన అప్‌డేట్(Updates) స్పష్టం చేస్తోంది.

లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నా కూడా విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం(Honor)దక్కడం విశేషం.

దుబాయి(Dubai)లో నిర్వహించనున్న ఎంఎంఏ ఛాంపియన్షిప్(MMA Championship) బాక్సింగ్(Boxing) పోటీలకు దుబాయ్ ప్రభుత్వం విజయ్ దేవరకొండను ముఖ్య అతిథి(Chief Guest)గా ఆహ్వానించింది. దీంతో ఆయనకున్న క్రేజ్ మళ్ళీ ప్రూవ్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరక్కేకించిన లైగర్ సినిమాలో ఎంఎంఏ ఛాంపియన్షిప్ కి పోటీపడే బాక్సర్ పాత్ర(Boxer Role)లో కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు రియల్ లైఫ్‌లో అదే ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీలకు ఆయనకు ఆహ్వానం అందడం గొప్ప విశేషం.

ఈ ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి ఇండియన్ యాక్టర్‌(Indian Actor)గా విజయ్ దేవరకొండ తన పేరును లిఖించుకున్నారు. లైగర్ మూవీతో వినూత్న ప్రయోగం చేశారు విజయ్ దేవరకొండ.

మొదటిసారి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల(Audience) ముందుకొచ్చినా ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొల్పింది. ఈ పరాజయాన్ని మరిచేలా తన రాబోయే చిత్రాలు ఉండాలని పట్టుదలగా ఉన్నారట విజయ్. అదే పూరి జగన్నాథ్(Puri Jaganath) దర్శకత్వంలో జనగణమన(Janaganamaana) సినిమా చేయబోతున్నారు విజయ్ దేవరకొండ.

అయితే లైగర్ పరాజయంతో ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ దగ్గరకు వెళ్లి దేశ సరిహద్దుల్లో విజయ్ దేవరకొండ నేర్చుకుంటున్న మెళకువలు చూసి ఇది జనగణమన సినిమా కోసమే వేస్తున్న స్టెప్స్ అంటున్నారు కొందరు. ఇకపోతే విజయ్ దేవరకొండ చేస్తున్న మరో సినిమా ఖుషి. శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వం(Direction)లో ఓ వైవిద్యభరితమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్(Movie Shooting) శరవేగంగా సాగుతోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత(Samantha) హీరోయిన్(Heroine) గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్(Romantic Entertainer) గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఓల్డ్ టైటిల్ తో రాబోతున్న ఈ ఖుషీ మూవీ(Khushi Movie)పై విజయ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు(Expectations) పెట్టుకున్నారు.