ఏపీ(AP) హైకోర్టు(High Court) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) రిలీజ్(Release) చేసింది. దీనిలో కంప్యూటర్ ఆపరేటర్ (Computer Operator) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో(District Courts) ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు, టైప్ రైటింగ్, పీజీ డిప్లొమా(కంప్యూటర్) లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ(Application Process) అక్టోబరు 29 నుంచి మొదలుకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం

మొత్తం ఖాళీ పోస్టులు – 11

కేటగిరీల వారీగా ఇలా.. జనరల్-06, బీసీ-ఎ-02, ఎస్సీ-02, ఎస్టీ-01.

వయసు: దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ(SC), ఎస్టీ(ST), ఈడబ్ల్యూఎస్(EWS) అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితి(AGE Limit)లో సడలింపు(Relaxation) వర్తిస్తుంది.

విద్యార్హత: ఏదైనా డిగ్రీ(Degree) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు.. టైప్ రైటింగ్(Type Writing) (హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్-ఇంగ్లిష్), పీజీ డిప్లొమా(Diploma)(కంప్యూటర్) లేదా బీసీఏ(BCA) అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.11.2012.

ఎంపిక విధానం: అభ్యర్థులకు ఆన్ లైన్(Online) విధానంలో పరీక్ష(Exam)ను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. వీటిలొ మెరిట్ ఆధారం(Merit Based)గా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు. వీటిలో జనరల్ నాలెడ్జ్(GK)-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్(General English)-20 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్(Computer Knowledge)-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం(Exam Time) 90 నిమిషాలు. ఈ రాత పరీక్ష(Written Exam)లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపిక(Job Selection)లో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు.