మన శరీరంలో పలు రకాల  విధులను నిర్వహించడంలో పోషకాలు(Nutrients) కీలక పాత్ర(Key role) పోషిస్తాయి. వాటిలో పొటాషియం(Potassium) ఎంతో కీలకమైంది. కండరాల కదలికలకు(Muscle Movements), నరాల ఆరోగ్యానికి(Healthy Nerves), ద్రవాల(Liquids)ను నియంత్రణలో ఉంచేందుకు ఈ పొటాషియం ఎంతగానో దోహద పడుతుంది.

శరీరంలో పొటాషియం లోపం(Deficiency) వల్ల అనేక రకాల ఆరోగ్య(Different Health Issues)  బారినపడే దుస్థితి ఏర్పడుతుంది. అసలు మన శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమవుతుంది? వీటి ద్వారా పొటాషియం లోపాన్ని సరిచేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం!

మనం నిత్యం తినే వివిధ రకాల ఆహారాల్లో ఎన్నో విటమిన్లు(Vitamins), మినరల్స్(Minerals) వుంటాయని మనకు తెలిసిందే. అలాంటి పోషకాలో పొటాషియం చాల ముఖ్యమైంది. ఇది మన శరీరంలో అనేక పనులను నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె(Heart), మూత్రపిండాలు(Kidneys),సక్రమంగా పనిచేయడంలో పొటాషియం పాత్ర గొప్పది. కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్న, ద్రవాలు నియంత్రణలో ఉండాలన్న పొటాషియం చాలా అవసరం. ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది సరైన పోషకాలు వున్న ఆహారం తీసుకోకపోవడం వల్ల వారిలో పొటాషియం లోపం కనిపిస్తోంది. ఫలితంగా వారు అనారోగ్య బారిన పడుతున్నారు.

పొటాషియం అవసరమనేది వ్యక్తులను బతి మారుతుంది. పొటాషియం శరీరానికి కావాల్సిన స్థాయిలో  అందితే గుండె జబ్బులు, రక్తపోటు(BP), పక్షపాతం(Paralysis) వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.శరీరానికి కావల్సినంతగా పొటాషియంను నిత్యం అందిస్తుండాలి. వాటిని మన డైట్లో(Diet) తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన డైట్లో పొటాషియం లోపిస్తే శ్వాస(Breathe) తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.

మానసిక ఆందోళన(Mental Stress) పెరుగుతుంది. ఎప్పుడు డిప్రెషన్లో (Depression)వుంటారు. రక్తం(Blood)లో పొటాషియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనం(Weak Muscles)గా మారుతాయి. పొటాషియం లోపిస్తే జీర్ణ వ్యవస్థ(Digestion System) పనితీరు మందగిస్తుంది.

పొటాషియం తాగితే అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. ఒక్కోసారి హార్ట్ బీట్ గతి తప్పినట్లు అనిపిస్తుంది. డైట్ ద్వారా తగినంత  పొటాషియం చేతులు, అరచేతులు కాలు, పాదాల్లో సూదులతో గుచ్చినట్టుగా ఉండి ఒక్కోసారి ఆ భాగాల్లో స్పర్శ(No Touch) ఉండదు. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందుల వాడకంతోనో పొటాషియం మోతాదులో శరీరంలో తగ్గిపోతాయి.

మన శరీరానికి సరిపడా పొటాషియం లభించాలంటే నిత్యం తాజా పండ్లు(Fresh Fruits),కురగాయలు(Vegetables), పప్పులు(Pulses) ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా అరటిపండ్లు(Banana), బత్తాయి(Orange) టమాటాలు(Tomatoes), పాలకూర(Lettuce), ఉప్పు(Salt) లేకుండా వేయించిన వేరుశనగ(Groundnuts), బీన్స్(Beans), బంగాళాదుంపలు మునగాకు, కొత్తమీరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

పొట్టు తీయని ధాన్యాలు, వైట్ ముష్రూమ్స్(Mushrooms), మాంసం(Meat), అవకాడో(Avocado), పుచ్చకాయలు(Watermelon), ఆకుపచ్చని కూరగాయల్లో పొటాషియం సంవృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో కీలక విధుల నిర్వహణకు పొటాషియం తప్పనిసరి అనే నిజాన్ని గుర్తించండి.కాబట్టి మీ డైట్లో పొటాషియం ఉండేలా మెనూ(Menu) ని ప్లాన్(Plan) చేసుకోండి.