హెచ్‌ఎండీ గ్లోబల్(HMD Global) భారతదేశం(India)లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌(New Budget Smart phone)ను విడుదల చేసింది. నోకియా G21 భారతదేశంలో గత సంవత్సరం ప్రారంభించబడిన Nokia G20కి సక్సెసర్‌(Successor)గా వస్తుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ (HMD Global) ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మంగళవారం విడుదల(Release) చేసింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేసి మూడు రోజులు వినియోగించుకోవచ్చంటూ బ్యాటరీ(Battery)ని హైలైట్(Highlight) చేస్తోంది. ఇక 90Hz రిఫ్రెష్ రేట్‌(Refresh rate)తో కూడిన డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా(Front Camera), Unisoc ప్రాసెసర్‌(Processor)తో Nokia G21 వస్తోంది. ఈ ఫోన్‌కు రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌గ్రేడ్స్(OS Upgrades), పోటీలో ఉన్న మొబైల్స్‌ తో పోలిస్తే రెట్టింపు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్(Security Upgrades) ఇవ్వనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ పేర్కొంది. నోకియా Nokia G21 స్పెసిఫికేషన్లు(Specifications), ధర(Price), సేల్(Sale) వివరాలు చూడండి.

భారతదేశంలో నోకియా G21 ధర, లభ్యత

భారతదేశంలో నోకియా G21 ప్రారంభ ధర రూ. బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్(Storage Variant) కోసం 12,999. ఫోన్ 6GB + 128GB మోడల్‌లో కూడా వస్తుంది, దీని ధర రూ.14,999. నోకియా Nokia G21 డస్క్ మరియు నార్డిక్ బ్లూ(Desk and Nordic Blue) రంగులలో వస్తుంది మరియు Nokia.com సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు(Retail Store) మరియు కీలకమైన ఈ-కామర్స్(E-Commerce) సైట్ల ద్వారా కూడా విక్రయించబడుతుంది. నోకియా జీ21 ని కొనుగోలు చేసే కస్టమర్‌(Customer)లు బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj Finserv) నుండి ట్రిపుల్ జీరో ఫైనాన్స్(Triple Zero Finance) ఆఫర్‌(Offer)ను పొందేందుకు అర్హులు.

Nokia G21 స్పెసిఫికేషన్లు

నోకియా జీ21 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్(Refresh Rate), 180Hz టచ్ శాంప్లింగ్ రేట్(Sampling Rate), 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్(Peak Brightness), 20:9 యాస్పెక్ట్ రేషియో(Accepted Ratio) ఉంటాయి. Unisoc T606 ప్రాసెసర్‌(Proccessor)పై ఈ మొబైల్‌ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 11(Android 11)తో విడుదల కాగా.. రెండు ఓఎస్ అప్‌గ్రేడ్లను ఈ మొబైల్‌ పొందుతుందని ఆ సంస్థ వెల్లడించింది. మైక్రో ఎస్‌డీ మెమరీ కార్డు(Micro SD Memory Card) కోసం ఈ ఫోన్‌లో స్లాట్ ఉంటుంది. వెనుక మూడు కెమెరాల సెటప్‌తో Nokia G21 మొబైల్‌ వస్తోంది.50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్(Depth Sensor) ఉన్నాయి. ఇక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను నోకియా అందిస్తోంది. 4G LTE, డ్యుయల్ బ్యాండ్ వైఫై(Dual Band WIFI), బ్లూటూత్(Bluetooth), ఎఫ్ఎం రేడియో(FM Radio), జీపీఎస్(GS), యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్(USB Type- C), 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ(Headphone Jack Connectivity) ఆప్షన్లుగా ఉన్నాయి. నోకియా జి 21Nokia G21 మొబైల్‌లో 5050mAh బ్యాటరీ ఉంటుంది.18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌(Fast Charging)కు సపోర్ట్ చేస్తోంది. అయితే ఫోన్‌తో పాటు బాక్స్‌ లో 10వాట్ల చార్జర్ మాత్రమే వస్తుంది. కాల్ క్వాలిటీ(Call Quality) మెరుగ్గా ఉండేందుకు OZO స్పెషియల్ ఆడియో క్యాప్చర్‌(Spatial Audio Capture)కు సపోర్ట్‌ తో కూడిన రెండు మైక్రోఫోన్లు(Microphones) ఈ మొబైల్‌కు ఉంటాయి. లాక్ బటన్‌(Lock Button)కే ఫింగర్ ప్రింట్ స్కానర్(Finger Print Scanner) ఉంటుంది. ఈ ఫోన్‌ బరువు మొత్తంగా 190 గ్రాములు.