ప్రముఖ కోలీవుడ్ స్టార్(Kollywood Star) హీరో దళపతి విజయ్(Dalapathi Vijay), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్‌'(Beast).

ఈ సినిమా ఏప్రిల్ 13న(April 13th) థియేటర్లలో దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్‌ రాబట్టుకున్న..తెలుగులో విజయ్‌ ఫ్యాన్స్ ను అలరించలేకపోయింది.

తమిళనాడులో ఈ చిత్రానికి మంచి రికార్డ్స్‌ వచ్చిన తెలుగు సిని ప్రేక్షక లోకంలో ఊహించిన కలెక్షన్స్‌ రాలేకపోయాయి.అయితే ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదలై చాలా తక్కువ సమయంలోనే OTTలో రావాడం గమనార్హం. ఈ నెల 11న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్(Netflix), సన్ నెక్స్ట్(Sunnext) లో స్ట్రీమ్(Stream) చేయబోతున్నారని సమాచారం.

తమిళం(Tamil)లో మంచి పేరుతెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో రెస్పాన్స్(Response) వస్తుందో చూడాలి.
ఈ మూవీ తో పాటు ఆర్ఆర్ఆ చిత్రం కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై (RRR OTT Releasing Date ) క్లారిటీ(Clarity) వచ్చేసింది. ఇది జీ5(Zee5), నెట్‌ఫ్లిక్స్(Netflix) లలో జూన్ 3న(June 3rd) స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 (ZEE5) భారీ డీల్‌కు సొంతం చేసుకోగా, హిందీ వెర్షన్(Hindi Version) మాత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేసింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు(Huge Collections) రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తోందోనని ఫ్యాన్స్(Fans) ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కలిసి నటించిన మల్టీస్టారర్(Multi starrer) చిత్రం’ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) (RRR Movie). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిన ఈచిత్రం బాక్సాఫీస్ ముందు బ్లాక్ బాస్టర్(Block Buster) గా నిలిచింది.

ఇక సక్సెస్ ఫుల్(Successful) డైరెక్టర్(Director) కొర‌టాల శివ(Koratala siva) ద‌ర్శ‌క‌త్వం(Direction)లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్‌(Multi starrer)గా రూపొందిన సినిమా ‘ఆచార్య’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29(April29th)న సినిమా రిలీజయ్యింది. అయితే మొదటి షో నుంచే ఆచార్య సినిమాకు నెగెటివ్ టా(Negative talk)క్ రావ‌డంతో కలెక్షన్స్ పై భారీగా ప్రభావం పడింది. దింతో రోజురోజుకు క‌లెక్ష‌న్స్‌ తగ్గుముఖం పడుతున్న క్రమంలో చిత్ర యూనిట్(Movie unit) కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆచార్య చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో విడుదల(Release) చేయాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారని తెలుస్తోంది. సినిమాను నాలుగు వారాల తర్వాత విడుదల చేసేలా ముందుగా ఒప్పందం చేసుకున్నారు. అయితే క‌లెక్షన్స్‌(Collections) తగ్గుతున్న కారణంగా చిత్ర యూనిట్(Movie unit) అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాగా రెండు వారాలు ముందుగానే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేస్తోంది.

ఏప్రిల్ 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల(Audience) ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, మే 30న (May30th) లేదా జూన్ మొదటి వారంలో ఆచార్య చిత్రం ఓటీటీలో రిలీజ్ కావాల్సింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య చిత్రం(Acharya May12th) మే 12న విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఆచార్య సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీ(OTT)లోకి రావడం ఫాన్స్ కు మాత్రం గుడ్ న్యూస్(Good news) అని చెప్పాలి.