ఇండియా పోస్ట్(Indian Post) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా(Country wide) ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులున్నాయి.  ఇక.. రెండు తెలుగురాష్ట్రాల్లో 2942 పోస్టులున్నాయి.

ఇందులో తెలంగాణ(Telangana)లో 1226, ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 1716 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 5 దరఖాస్తులకు చివరి తేదీ.

అర్హతలు, ఎంపిక విధానం:

పదవ తరగతి పాసైనవారంతా ఈ పోస్టులకు అప్లయ్‌(Apply) చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్(Indian Post) ఈ ఖాళీలను మెరిట్(Merit) ద్వారా ఎంపిక చేస్తోంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు: 2942

ఆంధ్రప్రదేశ్- 1716

తెలంగాణ- 1226

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్‌సీ(SC), ఎస్‌టీ(ST), దివ్యాంగులు(HANDICAPPED), మహిళలు(WOMAN), ట్రాన్స్ వుమెన్‌(Transwoman)కు ఫీజు లేదు.

వేతనం: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌(Branch Post Master)కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(Assistant Branch), గ్రామీణ డాక్ సేవక్(Grameena Dac Sevak) పోస్టులకు రూ.10,000.

ఎంపిక విధానం: టెన్త్‌ క్లాస్‌ మార్కుల మెరిట్(merit) ఆధారంగా ఎంపిక చేస్తారు.

సబ్‌మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్: 10వ తరగతి మెమో(Memo), ఫోటో(Photo), సంతకం(Signature).

దరఖాస్తులు ప్రారంభం: మే 2, 2022

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 5, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/