తెలంగాణ(Telangana) గ్రూప్-1 ప‌రీక్ష(Group -1 Exam)కు సంబంధించి అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల(Exam centers)ను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 16(October 16th)న ప్రిలిమ్స్ పరీక్ష(Preliminary Exam) జరగనుండగా, ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనరార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TSPSC Group 1 Prelims) పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో, దీనిని అక్టోబర్ 16కు పోస్టుపోన్ చేసారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియా(Social Media)లో పుకార్లు వచ్చాయి. అయితే  దీనిపై అధికారులు(Officers) క్లారిటీ(Clarity) ఇచ్చారు.

అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష ఖచ్చితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ  గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు అప్లై(Apply) చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు(Reserve) అయ్యాయి.

వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లో(General Posts)నూ మెరిట్(Merit) సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీ(Handicapped category)లో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553 (15.33 శాతం)మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేసుకున్నారు.

ఇక పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు(Hall Tickets) https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో రిలీజయ్యే(Release) ఛాన్స్ ఉంది.