బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5)  పదో వారం కెప్టెన్సీ(Captaincy) కంటెండర్స్ బిబి హోటల్ టాస్క్‌ పూర్తయింది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్(Contestants) కి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో షన్ను, సన్నీ ల మధ్య గొడవలు జరిగింది.

బిబి హోటల్ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరి పెర్ఫార్మన్స్ సరదాగా సాగిపోయింది, అయితే మరో టాస్క్ వచ్చే సరికి సన్నీ మళ్ళీ కంట్రోల్ తప్పాడు. అనవసరపు మాటలతో నోరు పారేసుకున్నాడు. సిరి మీద బాణాలులాంటి మాటలు వదిలాడు. అప్పడం అవుద్ది అంటూ అమర్యాదగా ప్రవర్తించిన సన్నీ.

మరో వైపు యాని మాస్టర్, కాజల్ మధ్య వాగ్వాదనలు జరిగాయి. బిబి హోటల్ లో రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్(Secret Task) లో గెలిచాడో? లేదో?కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు విజేతగా నిలిచి ఈ వారం కెప్టెన్ అయ్యారో? అసలు కెప్టెన్సీ టాస్క్ పెట్టిన రచ్చ ఏంటో? తెలియాలంటే 69వ ఎపిసోడ్ పై ఓ లుక్ వేయాల్సిందే……

బీబీ హోటల్‌(BB Hotel) టాస్క్‌ లో కాజల్‌ డబ్బులు దొంగిలించిన రవి వాటిని తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ సన్నీనెత్తుకుని తిప్పింది. తర్వాత  కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల టాస్క్‌ ముగిసిందని ప్రకటించాడు బిగ్‌బాస్‌(Big Boss).

టాస్క్‌ ముగిసే సమయానికి హోటల్‌ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉన్నాయి. గెస్ట్స్ దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్‌ స్టాఫ్ ఓడిపోయిందని, గెస్ట్స్ టీమ్‌ గెలిచిందని తెలిపాడు బిగ్‌బాస్‌.

తర్వాత షణ్ముఖ్‌ ప్రెస్టీజ్‌ చాంపియన్‌ ఆఫ్‌ ది వీక్‌గా సెలెక్టయి రూ.25,000 గిఫ్ట్‌ వోచర్‌(Gift Voucher) అందుకున్నాడు. ఇదిలా వుంటే సీక్రెట్‌ టాస్క్‌ పూర్తి  చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌.

ఇక గెస్ట్స్ టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్‌ స్టాఫ్ ని  ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్‌, పింకీలను అనర్హులు గా ప్రకటించారు. దీంతో వారు కెప్టెన్సీకి పోటీపడే ఛాన్స్ ని  కోల్పోయారు.

కెప్టెన్సీ బరిలో కాజల్‌, సిరి, సన్నీ, రవి పోటీ పడ్డారు. వీరికి ‘టవర్‌లో ఉంది పవర్‌’ అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో పోటీదారులు టవర్‌ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి.

టాస్క్(Task) లో మొదటి లెవల్‌లో ఓడిపోయిన కాజల్‌. రవికి సపోర్ట్‌ చేస్తున్న యానీకి చెక్కిలిగింతలు పెట్టింది. దీంతో ఇర్రిటేట్(Irritate) అయిన  యానీ అలా చేయకని వార్నింగ్ ఇచ్చింది.

మరోపక్క తనను ఆట ఆడకుండా అడ్డుపడుహతున్న సిరిపై ఫైర్ అయ్యాడు సన్నీ. నీ టవర్‌ను తంతానని చెప్పాడు. నన్ను పట్టుకున్నప్పుడు తోసేస్తే అప్పడం అయిపోయేదానివన్నాడు.

దీంతో మధ్యలో కలగజేసుకున్న షణ్ను ఏదీ, తన్ను చూద్దామంటూ మరింత రెచ్చగొట్టాడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద రచ్చే  జరిగింది. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్‌(Support) చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు దూసుకెళ్లారు.

కళ్లు లేవా? కామన్‌సెన్స్‌ లేదా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావు అని ఎలా అంటావ్‌? అని సిరి సన్నీ మీద గట్టిగానే అరిచింది. సన్నీ కూడా సిరికి తగ్గట్టుగానే నోరుపారేసుకున్నాడు.

ఇక యానీ ఈ ఆటలో ఎవరికి సపోర్ట్‌ చేశావని కాజల్‌ను అడగగా ఆమె తెలివిగా సన్నీకి అని కాకుండా రవికి అని చెప్పింది. దీంతో  యానీ అన్ని ఫాల్తూ గేమ్‌ ఆడతావు, నువ్వు గేమ్‌లో నన్ను టచ్‌ చేయొద్దు అని వార్నింగ్‌ ఇచ్చింది.

ఒక్క గేమ్‌ నిజాయితీగా ఆడలేదంటూ ఆమె ముందుకెళ్లి నాగిణి డ్యాన్స్‌ చేసింది. ఆమెను వెక్కిరిస్తూ మరింత రెచ్చగొట్టింది. ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్‌ కూలిపోవడం సన్నీ గేమ్‌(Game) నుంచి అవుట్‌ అయ్యాడు.

అయితే పింకీ కావాలనే టవర్‌ను కూల్చిందని సన్నీ, మానస్‌ అభిప్రాయపడ్డారు.

నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని ఓ తెగ ఫీలయ్యారు.

మొత్తానికి ఈ టాస్క్‌ (Task)లో రవి గెలిచి కెప్టెన్‌(Captain)గా నిలిచాడు.

మరి సీక్రెట్ రూమ్ లో వున్న జెస్సీ హెల్త్  ప్రోబ్ల్మ్స్ వల్ల బయటకు వెళ్తాడా? లేదంటే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా? అనేది రేపటి వీకెండ్ షో వరకు ఎదురు చూడాల్సిందే……..