స్టార్ హీరో సూర్య(Suriya), డైరెక్టర్ జ్ఞానవేల్ (T.J.Gnanavel) కంబినేషన్లో సినిమా ‘జైభీమ్’ (Jai Bhim) కే.మ‌ణికందన్, లిజొమోల్ జోస్ కీల‌క పాత్రల్లో న‌టించగా, రావు ర‌మేశ్‌, ర‌జిషా విజ‌య‌న్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ(Own Production) సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌(2D Entertainments Banner)పై సూర్య‌-జ్యోతిక‌ నిర్మించారు.

ప్రముఖ ఓటీటీ డిజిటల్(OTT Digital) ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వీడియోలో రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. లాయ‌ర్ రోల్‌లో హీరో సూర్య నటన అద్భుతం. ఇప్పటికే ఈ చిత్రం పలు అవార్డులను దక్కించుకుంది. నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్(Noida International Film Festival) లో 3 అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా అస్కార్(Oscar) కు కూడా నామినేట్(Nominate) అయింది ఈ చిత్రం. గోల్డెన్ గ్లోబ్ అవార్డు(Golden Globe Award)ల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్‌ కూడా అయింది. తాజాగా జైభీమ్ అరుదైన గౌరవం(Respect) దక్కించుకుంది.12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (12th Dadasaheb Phalke International Film Festival) ఈ చిత్రం రెండు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది.

ఉత్తమ చిత్రం(best movie), ఉత్తమ సహాయ నటుడు(Best Supporting Actor) కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బాధితుడి పాత్రలో జీవించిన మ‌ణికంద‌న్‌కు ఉత్తమ స‌హాయ న‌టుడు పురస్కారం(Puraskar) దక్కింది.