సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్(Science fiction Thriller) ‘యశోద’ (Yashoda) తెరకెక్కిన చిత్రంలో టైటిల్ పాత్ర(Title Role)లో సమంత రుత్ ప్రభు నటిస్తోంది.

ఈ చిత్రానికి హరిశంకర్(Hari Shankar) మరియు హరీశ్ నారాయణ(Harish Narayana) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sri Devi Movies) పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్(Shivalenka Krishna Prasad) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పాన్ ఇండియన్ చిత్ర షూటింగ్ ను గతేడాది డిసెంబర్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ చిత్రీకరణ(Shooting) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కొంత భాగం యాక్షన్స్ సీక్వెల్స్(Action Sequels) ను కూడా చిత్రీకరించారు. ఈ నెలాఖరు కల్లా చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి కానుంది. మొదటి సరి వైవిధ్యమైన జానర్(Different Zoner) లో సమంత నటిస్తుండటంతో అభిమానులు,ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సెట్ కు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
కాగా, రంజాన్ పండుగ సందర్భంగా చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్(Crazy Update) ను అందించారు మేకర్స్(Makers). ఇప్పటికే చిత్రం రిలీజ్ ను డేట్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా ‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీను ప్రకటించారు. మే 5న ఉదయం 11:07 నిమిషాలకు, ఫస్ట్ గ్లింప్స్(First Glimpse)విడుదల కానుంది.

దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆగస్టు 12(August 12th)న ‘యశోద’ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక చివరిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రంలో నటించింది.

కేవలం స్పెషల్ సాంగ్ లో నటించి ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటావా మావా’ చిత్రంతో దేశ వ్యాప్తం(India Wide)గా పాపులర్(Popular) అయ్యింది సమంత. ఆ క్రేజ్ తోనే తన పాన్ ఇండియన్(Pan India) చిత్రాలపై ఫోకస్(Focus) పెట్టింది. తను నటిస్తున్న మరో చిత్రం ‘శాకుంతలం’ (Shakuntalam).

అలాగే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana)లో వస్తున్న తాజా చిత్రంలోనూ సమంత హీరోయిన్ గా నటించనుంది.