తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా పరిచయమై తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే కోవలో రవితేజ ఇంటి నుంచి ఓ వారసుడు సినీ ప్రవేశం చేసాడు. రవితేజ(Ravi teja) తమ్ముడు రఘు కొడుకు మాధవ్(Madhav) హీరో(Hero)గా కొత్త సినిమా ప్రారంభం అయింది.

జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్(JJR Entertainments) పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న దర్శకురాలు(Director) గౌరీ రోణం(Gowri Ronam)కి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తోంది.

తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్(Rama naidu Studios) లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది.

దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్(Script) ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది.

దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను  జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీలో ఈ రోజు ప్రొడక్షన్ నెంబర్ 2(Production 2) ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు గారు స్క్రిప్ట్ అందజేయడం, ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టడం, కెమెరా సురేష్ బాబు గారు స్విచ్ ఆన్ చేశారు.

పెళ్లి సందడి మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి రెండో చిత్రాన్ని మా బ్యానర్ లో చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్మాత. రవితేజ  సోదరుడు రఘు అబ్బాయి మాధవ్ ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉందన్నారు.

ఈ సినిమా గౌరి రోణింకి డైెరెక్ట్ చేసిన  పెళ్లి సందడి ఫ్లేవర్ లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి తన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ గారు షూటింగ్ లో బిజీగా ఉండి ఈ ఓపెనింగ్ కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మాధవ్ ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తునన్నారు.

గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్(Sambhasiva Creations Banner)  లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్ లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదట్నుంచీ నాకు సపోర్ట్ గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు  ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది.

వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్(Shooting Start) కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.

త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల వివరాలు తెలియజేయబోతోన్న  ఈ మూవీ సాంకేతిక నిపుణుల విషయాన్ని వస్తే, అనూప్ రూబెన్స్(Anoop Rubens) సంగీతం(Music) అందించగా , ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్(Art Director) గా రామ్(Ram), సినిమాటోగ్రఫీ(Cinematuography) గా కిరణ్ కుమార్ మన్నె(Kiran kUmar Manne)  వ్యవహరిస్తున్నారు, ఎడిటింగ్(Editing) కార్యక్రమాలు  విప్లవ్పిఆర్వో, జిఎస్కే మీడియా అందిస్తుంది.

ఈ చిత్రానికి నిర్మాతగా జేజేఆర్ రవిచంద్రచన వ్యవహరిస్తున్నారు.