తెలంగాణ(Telangana) లో టెన్త్ ఎగ్జామ్స్(Tenth Exams) మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గతంలో 11 పేపర్లతో టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించగా 6 పేపర్లకు కుదించింది విద్యాశాఖ.

ఇంకా కరోనా తర్వాత సిలబస్(Syllabus) ను తగ్గించి పరీక్షలు నిర్వహించగా ఈ సారి వైరస్ ప్రభావం తగ్గడంతో వందశాతం సిలబస్ తో ఎగ్జామ్స్ ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా పరీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే బిట్‌ పేపర్‌(Bit Paper)మల్టీపుల్‌ చాయిస్‌ క్వశ్చన్(MCQ) పేపర్(Question Paper))ను చివరి 15 నిమిషాల్లోనే ఇవ్వనున్నట్లు తెలిపింది.

జనరల్‌ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నాపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని దిశానిర్ధేశం చేసింది.

పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.11 పేపర్లకు గాను ఆరు పేపర్లుగానే నిర్వహించే ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులకు 1 పేపర్ ఉండగా, సైన్స్ మాత్రం రెండు పేపర్లు ఉంటాయి.

ఇందులో జనరల్‌ సైన్స్‌ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్‌ సైన్స్‌, మరొకటి బయాలాజికల్‌ సైన్స్‌ పేపర్లు. జనరల్‌ సైన్స్‌ లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని సూచించారు.

అనంతరం 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని దిశానిర్ధేశం చేశారు. రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం ఇస్తారు. ఇక, మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇస్తారు.

విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్(Formative Assessment) కు 20 మార్కులు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ తాజాగా పూర్తి వివరాల(Full Details)తో కూడిన ప్రకటన(Announcement) విడుదల(Released) చేసింది.