స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) విజయవంతంగా దూసుకుపోతోంది. మూడు వారాలు పూర్తి చేసుకుని, నాలుగో వారం లోకి అడుగుపెట్టిన షో. ఇప్పటికే సోమవారం నామినేషన్స్(Nomination) ప్రక్రియలో లోబో అసభ్యకర  ప్రవర్తనతో ప్రియను ఏడిపించేసాడు.

ఇక విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య వాగ్వాదనలతో ఇద్దరు తెగ రెచ్చిపోయారు. అలాగే రవి, కాజల్ మధ్య కూడా హీట్ ఆర్గుమెంట్ జరిగింది.

ఇక 23వ రోజు  24వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో , ఎలాంటి ట్విస్ట్ లు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ పెద్ద రచ్ఛకే దారి తీసింది . ఈ వారం ఎనిమిది సభ్యులు (Elimination) నామినేట్ అయ్యారు.

ఇక నేటి 24 ఎపిసోడ్‌లో  యాంకర్ రవి నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి గుంటనక్క నేనే కదా అని  అడిగాడు. నువ్వు  ఎవ్వర్నీ ఇన్ఫ్లుయెన్స్(Influence) చేయకు, నాకు అప్పుడు ఆలా అనిపించింది కాబట్టే చెప్తున్నా.  నువ్ ఫీల్ అవ్వకు అని చెప్పాడు నటరాజ్ మాస్టర్.

ఒక్కసారి నువ్వు  గుంటనక్క కాదని చెప్పండి మాస్టర్. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అంటే అందరూ నా వైపు చూస్తున్నారు. నాకు ఎలాగోవుంటుందని ఫీల్ అయ్యాడు రవి .

రంగులు మార్చే ఊసరవెల్లి ఒకడు నీ గురించి నా దగ్గర మాట్లాడాడు కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నాడు. వాడి గురించి నీకు తరువాత చెప్తా అని అనడంతో ఎవరు విశ్వనా అని అడిగాడు రవి. మరోపక్క.

ఇక నామినేషన్(Nomination) టైం లో  కాజల్ తనని ఫిజికల్‌గా టచ్ చేయడం నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు రవి. అది మనసులో పెట్టుకుని కాజల్ బాధపడింది. రవి వచ్చి కాజల్ పక్కన కూర్చోవడానికి ట్రై చేసిన, కాజల్ లేచి వెళ్లిపోయింది. ఫిజికల్ అంటావా?? ఆ  వర్డ్ నాకు నచ్చలేదని చెప్పి సీరియస్ అవుతూ లేచి వెళ్లిపోయింది.

లోపలికి వెళ్లి సిరిని పట్టుకుని ఏడ్చేసింది. అయితే రవి మానస్ దగ్గర  మళ్లీ బయట కవర్ చేసుకునే పని లో పడుతాడు. ఆ తరువాత కాజల్‌ని కన్వెన్స్ చేయడానికి ప్రయత్నించాడు.

ఆ తరువాత యాంకర్ రవి, విశ్వ, మానస్, శ్రీరామ్‌ల దగ్గరకు వచ్చి.. నటరాజ్ మాస్టర్ అందరికీ జంతువుల పేర్లు పెడుతున్నాడు.. అతను గుంటనక్క అన్నది నన్నే అని ఈ విషయం ఇంట్లో అందరికి తెలుసుగాని చెప్తాడు .

ఇప్పుడు కూడా నిన్ను కాదని అంటున్నాడు. నువ్వు ఎవర్నైతే విశ్వ అన్న.. విశ్వ అన్న అని అంటున్నావో వాడు నా దగ్గరకు వచ్చి. రవికి గుంటనక్క అని కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నాడని నటరాజ్ మాస్టర్ చెప్తున్నాడు. నువ్వు  అన్నావా? అని విశ్వని అడగ్గా విశ్వ షాక్ అవుతాడు నేను అన్నలేదని చెప్తాడు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్(House mates) కి  టాస్క్ ఇచ్చారు, హౌస్ లో ఉన్న వాళ్లు ఇద్దరిద్దరు చొప్పున జంటలుగా విడిపోవాలని. అలాగే వెయిట్ కూడా చూసుకోవాలని చెప్పారు. అయితే అందరికంటే ముందుగా అందరూ ఊహించనట్టే షణ్ముఖ్.. నేను సిరి ఉంటామ్ అని తెగేసి చెప్పాడు.

ఇక బిగ్ బాస్(Big boss) హౌస్‌లోకి కొంతమంది బయట వ్యక్తులు వచ్చి.. ఇంట్లో ఉన్నఫుడ్ ని  తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత హౌస్ మేట్స్ లో  జంటలు గా  ఎవరెవరో చెప్పాలని కెప్టెన్ జస్వంత్‌ని అడిగారు బిగ్ బాస్. జంటలు ఎవరెవరంటే- కాజల్-జెస్సీ, షణ్ముఖ్- సిరి, లోబో- నటరాజ్, రామ్ -హమీదా,శ్వేతా-ఆనీ మాస్టర్, ప్రియ- ప్రియాంక, రవి – విశ్, సన్నీ – మానస్

కెప్టెన్సీ టాస్క్ గా  ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే టాస్క్(Task) ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో అన్ని జంటల ఏకైక లక్ష్యం సాధ్యమైనంత బరువుని కోల్పోవడం.

ఏ జంట అయితే అందరి కంటే ఎక్కువగా బరువుని కోల్పోతారో వాళ్లే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని మెలిక పెట్టారు  బిగ్ బాస్(Big boss). ఆహారానికి బదులుగా ప్రొటీన్స్, కొబ్బరినీళ్లని మాత్రమే అందిస్తాం అని చెప్పారు.

ఇక  నటరాజ్ మాస్టర్ వింతగా ప్రవర్తించాడు. తనలో తాను మాట్లాడుకుంటూ, పెద్ద పెద్దగా నవ్వుకుంటూ మంచి బలం ఉన్న ఫిజికల్ టాస్క్ పెడితే నా వేట ఏంటో చూపిస్తా అని తనలో తాను మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు.

ఆయన ప్రవర్తన చూస్తుంటే అది నటరాజ్ మాస్టర్ స్ట్రాటజీ లా అనిపిస్తోంది. లోబో అయితే అతని పిచ్చి చేష్టలు చూసి బిత్తరచూపులు చూసాడు.

మిగిలిన హౌస్ మేట్స్(house mates) కి  నటరాజ్ మాస్టర్ ప్రవర్తన అర్థంకాక విచిత్రం గా చూస్తూ వుండిపోయారు. నవ్వుతుంటే లోబో అతన్ని చూసి.. టాస్క్ సంగతి ఏమో కానీ మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందని దండం పెట్టేశాడు. చూసే ఆడియన్స్(Audience) కూడా నటరాజ్ మాస్టర్‌కి వింత ప్రవర్తనకి ఆశ్చర్యపోయివుంటారు .

మరోవైపు నటరాజ్ మాస్టర్‌తో జోడీ కట్టిన లోబో ఆకలికి ఆగలేక.. ప్రిజ్డ్‌లో పెట్టిన ఫుడ్‌ని సీక్రెట్‌గా లాగించేయడంతో హౌస్‌ కెప్టెన్ జెస్సీకి శిక్ష వేశాడు బిగ్ బాస్(Big boss). అతనితో పాటు జెస్సీతో జోడీ కట్టిన కాజల్‌ కూడా కెప్టెన్సీ అనర్హత వేటుకి గురైంది.  దీనితో జెస్సీ అసహనం గా ఫీల్ అవుతాడు.

మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి టాస్కులు, పనిష్మెంట్ లు ఇవ్వనున్నారో బిగ్ బాస్.