హై కొలెస్ట్రాల్(High cholesterol) వల్ల చాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా అధిక కొవ్వు(Fat) సమస్య మగవారి(Men)లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఈ సమస్య వల్ల గుండె పోటు(Heart Stroke), స్ట్రోక్(Stroke), మరియు పెరిఫెరల్ ఆర్టరీ(Peripheral Artery) లాంటి వ్యాధులతో పురుషులలో ఎక్కువ ప్రమాదం పొంచి వుంది. హై కొలెస్ట్రాల్ పై జరిగిన విశ్వక పరిశోధనల(Research) వల్ల ఈ సమస్య 20 ఏళ్లకే మొదలై వయసుతో పాటు సమస్య తీవ్రత పెరుగుతున్నట్టు తేలింది.

మరి మగవారిలో హై కొలెస్ట్రాల్ లేకుండా ఉండాలంటే ఎం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం! హై కొలెస్ట్రాల్ సమస్య కూడా  ఆరోగ్యకరమైన జీవితాన్ని(Healthy Life) గడపకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య గా చెప్పుకోవచ్చు. అధిక బరువు(Over Weight), ఇనాక్టివిటీ(Inactivity) , స్మోకింగ్(Smoking), ఊబకాయం(obesity) వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం వుంది.

బాలన్సుడ్ డైట్(Balanced Diet) తీసుకోవడం, క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం(Regular Exercise), వైద్యులు సూచించిన(Doctors Advice) మందులు రేగులర్గా(Regular Medicine) ఉపయోగించడం వల్ల హై కొలెస్ట్రాల్ తో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాలన్స్ గా ఉంటాయి.

హై లెవెల్ కొలెస్ట్రాల్ ను గుర్తించాలంటే బ్లడ్ టెస్ట్(Blood Test) తప్పని సరి అయితే కొన్ని రకాల లక్షణాలను బట్టి కూడా  మనం హై కొలెస్ట్రాల్ సమస్యను గుర్తించవచ్చును. గోళ్ళ రంగు మారిపోవడం(Changes in nails Color), పాలిపోయినట్టు ఉండడం హై కొలెస్ట్రాల్ లక్షణం గా చెప్పచు. కాళ్ళల్లో ఎటు వంటి నొప్పి కలిగిన, కళ్ళు, పాదాలలో తిమ్మిరినిపించిన హై కొలెస్ట్రాల్ కి సంకేతంగా భావించాలి.

కొలెస్ట్రాల్ కి, పురుషులకు ముడి పడిన అంశాల గురించి తప్పక ప్రస్తావించుకుని తీరాలి. పురుషులకు ముఖ్యమైన హార్మోన్(Hormone) టెస్టోస్టెరోన్(Testosterone), ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని పరిశోధకుల అభిప్రాయం.

టెస్టోస్టెరోన్ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం తో పాటు కండరద్రవ్య రాశిని నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందన్నది కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. కొలెస్ట్రాల్ లేదా కొవ్వు లన్నది రెండు రకాలు మంచి కొలెస్ట్రాల్ ఎచ్డిఎల్(HDL) అని, ఎల్డిఎల్(LDL) అని అంటారు. మన రక్త(Blood)లో చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) ఎప్పుడు అదుపులో ఉండాలి.

అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలంటే,ఉప్పును తగిన మోతాదు లో తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా శరీరాన్ని మైంటైన్  చేయాలి. రేగులర్గా ఫిట్నెస్(Fitness) ను కాపాడుకుంటూ, ఊబకాయం బారిన పడకుండా చూసుకోవాలి.

కొవ్వు ఎక్కువగా వుండే మాంసాహారాన్ని వీలైనంత తగ్గించడమో, లేదంటే  పూర్తిగా మానేయడమో చేయాలి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి తాజా పండ్లు(Fresh fruits), కూరగాయలు(Vegetables) ఎంతగానో ఉపయోగపడతాయి.

నేడు చాల మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడడానికి ముఖ్య కారణం సమయపాలన లేని ఆహారపు అలవాట్లతో పాటు, బాలన్సుడ్ డైట్ పై అవగాహనా లేకపోవడం అని చెప్పచు.

బాడ్ కొలెస్ట్రాల్ ని అదుపు(Control)లో ఉంచుకోవడం కోసం కొలెస్ట్రాల్ ని తగ్గించే ఆహారాలను డైట్ లో చేసుకోవాలి. తృణధాన్యాలు(Millets), నట్స్(Nuts) ఎక్కువగా తీసుకోవాలి.

నట్స్ లో ఎక్కువగా లభించే ప్రోటీన్(Protein) బాడ్ కొలెస్ట్రాల్ ని బాగా తగ్గిస్తుంది.తృణధాన్యాల్లో వుండే ఫైబర్(Fiber) బాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఓట్స్(Oats) లో అధికంగా లభించే ఫైబర్ ఆకలిని తగ్గించడమే కాకుండా, బాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.

ప్రతి రోజు గ్రీన్ టీ(Green Tea) తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాల(Process Food)ను సాధ్యమైనంత దూరం పెట్టాలి. మద్యపానం(Drinking), దూమపానం(Smoking)కి ఫుల్స్టాప్ పెట్టాలి. కాలేయం(Liver)లో తాయారయే చెడు కొలెస్ట్రాల్  ని అదుపు చేయడంతో పాటు, రక్తంలోని  కొవ్వుని తగ్గించడంలోను ఆపిల్(Apple) పండు కీలక పాత్ర(Key Role) పోషిస్తోంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సబ్జా  గింజలు(Sabja Seeds)  ఎంతగానో ఉపయోగపడతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది. వైద్యుడు చేకూరిన , పెద్దలు చెప్పిన తిరుగులేని ఆరోగ్య సూత్రం. జీవన శైలి, తీసుకునే ఆరోగ్యం పైనే ఆరోగ్యం ఆధారపడి ఉందనేది జీవితం చెప్పిన పాఠం.

మంచినీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం వేళ్ళకు నిద్రపోవడం, ఒత్తిడి(Stress)ని జేయించడం వంటివి కంట్రోల్ లో ఉంటే  ఎటువంటి అనారోగానైనా దూరంగా వుంచవచ్చు.

మగవారిలో హై కొలెస్ట్రాల్ సమస్యను కూడా ఇదే ఆరోగ్య సూత్రం వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చెక్ చేయించుకుంటే, వైద్యుల సలహా మేరకు నడుచుకుంటే హై కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.