మనం నిత్యం ఉపయోగించే వస్తువులలో కలం అదేనండి పెన్ను (pen) కి చాలా ప్రత్యేకమైన  స్థానం ఉంది . ఇక స్కూళ్ల నుండి ఆఫీస్ ల వరకు  ఈ  కలం లేకుండా ఏ ఒక్క పని జరుగదంటే అతిశయోక్తి కాదు.

మనం ఉపయోగించే ఈ పెన్ను ప్లాస్టిక్ తో కానీ కార్బన్ ఫైబర్ తో గాని లేదా చెక్కతో గాని చేయబడి ఉంటుంది. వీటిల్లో ఎక్కువగా మనం ఉపయోగించేది ప్లాస్టిక్ తో చేసిన పెన్నులనే, అంతేకాకుండా  సగటున సంవత్సరంలో ఒక మనిషి ఉపయోగించే పెన్నులు 10 నుంచి 20 దాకా ఉండొచ్చు అని ఒక అంచనా. అయితే అవసరం తీరినప్పుడు మనం వాటిని పారవేసి చెత్త కుప్పలకి పరిమితం చేస్తున్నాము.

ఒక్క అమెరికాలోనే సంవత్సరానికి 1.6 బిలియన్ల ప్లాస్టిక్ పెన్నులని పార వేస్తూ ఉంటారని ఇటీవల చేసిన ఒక సర్వేలో తేలింది, ఇక ప్రపంచం మొత్తం చూస్తే సరాసరి 100 బిలియన్ల ప్లాస్టిక్ పెన్నుల దాక ఉండొచ్చు. దీనివల్ల పర్యావరణానికి జరిగే నష్టం మనకు తెలియనిది కాదు.

దీనిని ఆధారం చేసుకుని డబ్ల్యు వై ఎన్ ల్యాబ్స్ (WYN LABS) వారు ఒక సరికొత్త పెన్ను కి శ్రీకారం చుట్టారు. ఇందులో లో ప్లాస్టిక్ కానీ ఇతర ఏ మెకానికల్ పార్ట్స్ అంటే స్ప్రింగ్, స్క్రూ లేదా బటన్ లాంటివి ఏమీ ఉండవు. అల్యూమినియం తో తయారు చేయబడిన ఒక సాలిడ్ బాడీ ఈ పెన్ను ప్రత్యేకత. దీనిలో మన ఉపయోగించే రీఫిల్ కూడా అల్యూమినియం తో తయారు చేయబడి ఉంటుంది.

ఈ పెన్ను నిర్మాణం చూస్తే మీకే అర్థమవుతుంది. మధ్యలో చీలిక ఉండి, ఈ పెన్ను రెండు భాగాలుగా విడదీయబడి ఉంటుంది. రీఫిల్ వేసుకోవడానికి ఒక భాగాన్ని కొంచెం వెనక్కి పుష్ చేస్తే సరిపోతుంది, అంతే ఇది చాలా సింపుల్ అన్నమాట.

అంతేకాకుండా ఈ పెన్ను మనకి 2 మోడల్స్ లో, మరియు 5 కలర్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ మీరు కింద చూడవచ్చు.

  • Models: Round and Hexagon
  • Colors: SILVER, BLACK, PEWTER BLUE, LIGHT GOLD, PINK
  • Length: 125 mm | 4.9 in
  •  Diameter: 10.0 mm | 0.39 in
  •  Weight: 15 gr | 0.53 oz.  (20 gr | 0.7 oz. with Refill)
  •  Material: 6061 T6 Aluminum
  •  Finish: Anodized
  •  Refill: Fisher Space PR Ser

 

డబ్ల్యు వై ఎన్ ల్యాబ్స్ ఈ పెన్ను ని జూలై 2021 మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు. దీని ధర $45 USD. ఈ పెన్ను తో ప్లాస్టిక్ పెన్నులకి ఇక స్వస్తి అని చెప్పొచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన వస్తువులు రానున్న రోజుల్లో తక్కువ ధరకి అందరికి అందుబాటులోకి రావాలని ఆశిద్దాం .

Courtesy